Breaking News

ఆర్టీసి మిలియన్‌ మార్చ్‌ అడ్డగింత

ఆర్మూర్‌, నవంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ మిలియన్‌ మార్చ్‌ వెళ్లకుండా అక్రమంగా ఆర్టీసీ కార్మికులను, నాయకులను అఖిలపక్షం నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆర్మూర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో సిపిఎం ఆర్మూరు మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం ఆర్మూరు కార్యదర్శి పల్లపు వెంకటేష్‌ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారం 37వ రోజు కొనసాగుతోందన్నారు.

ముఖ్యమంత్రి నియంత పాలనకు చరమగీతం పాడటానికి శనివారం హైదరాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు ట్యాంకుబండ్‌పై వేలాది మందితో మిలియన్‌ మార్చ్‌ నిర్వహించతలపెట్టామన్నారు. కానీ అక్కడికి వెళుతున్న నాయకులను ఆర్టీసీ కార్మికులను అఖిలపక్ష నాయకులను దొంగల్లాగా శుక్రవారం నుండి వచ్చి అక్రమంగా అరెస్టు చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

హైకోర్టుకు తప్పుడు లెక్కలు చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్‌ అని రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. అందుకే తిక్కతిక్కగా మాట్లాడే పద్ధతి పరిస్థితులు ముఖ్యమంత్రికి వచ్చాయని, కార్మికులను యూనియన్‌ నాయకులు రెచ్చగొడుతున్నారని యూనియన్‌లో అక్కర్లేదని, మతిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. 50 వేల కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కిందన్నారు.

కెసిఆర్‌ ప్రభుత్వం మెడలు వంచడానికి శనివారం మిలియన్‌ మార్చ్‌కి వెళుతున్న అఖిలపక్ష నాయకులకు ఆర్టీసీ కార్మికులను అరెస్టులు చేసి స్టేషన్లలో బంధించారని, అంతమాత్రాన ఉద్యమం ఆగదని, ఇంకా ఉవ్వెత్తున పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు. లేనియెడల ఉద్యమాన్ని ఉధతం చేస్తామని, ముఖ్యమంత్రి మెడలు వంచే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, నాయకులు శర్మ, ఏం లింబాద్రి, నవాబ్‌, బోళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బీజేపీ మండల అధ్యక్షుడుగా చుక్క రాజు

రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా క్యాంపులో బుధవారం జరిగిన బీజేపీ మండలస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *