Breaking News

Daily Archives: November 12, 2019

త్రివేణి సంగమంలో కార్తీక శోభ

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం భక్తులతో కార్తీక శోభ సంతరించుకుంది. మంగళవారం కార్తీక పౌర్ణమి కావడంతో త్రివేణి సంగమ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి నదిలో వదిలి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీకమాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో శివునికి పూజలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గోదావరి పరివాహక ప్రాంతమైన కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రానికి అధికసంఖ్యలో ...

Read More »

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి సాయినాథ్‌ (15) అనే బాలుడు మతి చెందినట్లు రెంజల్‌ ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… బోధన్‌ మండలం బిక్నెల్లి గ్రామానికి చెందిన సాయినాథ్‌ తోటి మిత్రులతో కలిసి మంగళవారం ఉదయం నీలా గ్రామానికి వచ్చి సైకిల్‌ రిపేయిర్‌ చేయించుకుని తిరుగు ప్రయాణంలో నీలా గ్రామ శివారులో గల పసుపు వాగులో స్నానాలు ఆచరించేందుకు వెళ్ళాడు. కాగా ప్రమాదవశాత్తు జారీ పడి ...

Read More »