Breaking News

రక్తదానం చేసిన మండల వ్యవసాయ విస్తరణ అధికారి

కామారెడ్డి, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌కి చెందిన కవితకు గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వహకుడు బాలును సంప్రదించారు. దీంతో వారు కామారెడ్డి మండల వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్‌ రెడ్డి సహకారంతో బుధవారం ఉదయం విటి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్భంగా రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ గడచిన 15 సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లాతో పాటు మెదక్‌ జిల్లా నిజామాబాద్‌, సిరిసిల్ల, హైదరాబాద్‌ వివిధ ప్రాంతాలకు చెందిన ఆపదలో ఉన్న వారికి అవసరమైన రక్తాన్ని సకాలంలో అందజేసి ఇప్పటివరకు రెండు వేల మందికిపైగా ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.

సమాజంలో యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, రక్తదానం ప్రాణదానం తో సమానమన్నారు. కార్యక్రమంలో రోగి బంధువులు మహిపాల్‌ రెడ్డి, రజిత, టెక్నీషియన్‌ ఏసు గౌడ్‌ తదితరులున్నారు.

Check Also

గణతంత్ర వేడుకలు ఘనంగా ఉండాలి

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర వేడుకలను ఆకట్టుకునే విధంగా ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *