Breaking News

ఆసరా పించన్‌ల పంపిణీ

నందిపేట్‌, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని తపాలా కార్యాలయానికి ఆసరా పింఛన్‌ దారులు బుధవారం భారీగా తరలివచ్చారు. స్థానిక తపాలా కార్యాలయం వద్ద వద్ధులు, వితంతువులు బీడీ కార్మికులు తమ ఆసరా పింఛన్‌ కొరకు ఉదయం 6 గంటలనుండి వరుస కట్టారు. ఆసరా పెన్షన్‌లు ప్రతి నెల మొదటి వారంలో పంచుతారు కానీ ఈ నెల పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం ఆలస్యం కావడంతో బుధవారం మొదటి రోజు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు.

ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైన పంపిణీ సాయంత్రం 6 గంటలు కావస్తున్నా ముగియలేదు. దీంతో అధికారులు వచ్చిన వారిని వాపస్‌ పంపకుండా పెన్షన్‌ పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు తమ వెంట నాలుగు రూపాయల చిల్లర తీసుకువచ్చి 2016 రూపాయలు తీసుకెళ్తున్నారు.

Check Also

గణతంత్ర వేడుకలు ఘనంగా ఉండాలి

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర వేడుకలను ఆకట్టుకునే విధంగా ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *