కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో అర్టిసి కార్మికులకు మద్దతుగా 13 వ రోజు పాదయాత్ర కొనసాగింది. లింగాపూర్ స్టేజ్ చేరుకున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు గణేశ్, సాయి చైతన్యలకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాలరాజు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి దశరథ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేశ్ కుమార్, ఆర్టిసి, జేఏసి నాయకులు దాస్, రాజు, మారుతి, తదితరులున్నారు.
Read More »Daily Archives: November 14, 2019
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రాజీవ్ పార్క్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, పార్కులో బోరు పని చేయక బాత్రూంలో నీళ్లు లేక దుర్వాసన వస్తుందని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లాకలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్క్ ముందర చెత్త కుప్పలు, కలేబరాలు, అపరిశుభ్రమైన వాతావరణం ఉందన్నారు. కామారెడ్డి అధికారులు రాశివనంపై చూపించిన ప్రేమలో ఒక్క శాతం కూడా రాజీవ్ పార్క్ పైన చూపించినా, ఉదయం వాకింగ్ ...
Read More »విధుల పట్ల అలసత్వం తగదు
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిఎంఅండ్ హెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్ మచారెడ్డి పిహెచ్‌సిని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. ఆరోగ్య సేవలు అందించడంలో అలసత్వం వహించరాదని సిబ్బందికి సూచించారు. సేవల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కెసిఆర్ కిట్, ఎన్సిడి, అమ్మఒడి, టిబి, కుష్టు, డెంగీ, మలేరియా వ్యాధులు అరికట్టేందుకు ఆరోగ్య సిబ్బంది తమ వంతు కషి చేయాలని సూచించారు. అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read More »జెండాగల్లి పాఠశాలలో బాలల దినోత్సవం
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల దినోత్సవాన్ని గురువారం 300 క్వాటర్స్లోనీ జండా గల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలతో పాటు సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్ ఉపాధ్యాయులు మంజుల నరేష్, కవిత, శైలజ పాల్గొన్నారు.
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో గురువారం నిజామాబాదు నగరంలోని వి.ఎన్.ఆర్. పాఠశాలలో బాలల దినోత్సవ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విచిత్ర వేషధారణ, ఏక్ మినట్, మ్యూజికల్ చైర్ తదితర పోటీలు నిర్వహించారు. విచిత్ర వేషధారణ పోటీలో పాల్గొన్న చిన్నారులు నెహ్రూ, సైనికుడు, డాక్టర్, స్పైడర్ మెన్ వేషాల్లో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి లయన్స్ జిల్లా జీఎస్టీ కో ఆర్డినేటర్ గంధాని శ్రీనివాస్ ముఖ్యఅతిధిగా హాజరై విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ...
Read More »నోటుపుస్తకాల పంపిణీ
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో గురువారం నిజామాబాదు మండలం ధర్మారం తాండా ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ సంబరాలు నిర్వహించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులకు పండ్లు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. పేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ అండగా ఉంటుందని చెప్పారు. లయన్స్ క్లబ్ కార్యదర్శి చింతల గంగాదాస్, కోశాధికారి సిలివేరి గణేష్, ...
Read More »షుగర్ వ్యాధి అవగాహన ర్యాలీ
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నిజామాబాదు నగరంలో గురువారం ఉదయం లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో డయాబెటిక్ అవగాహన కారు ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ మైదానం వద్ద ర్యాలీని నిజామాబాద్ ఏసిపి జి.శ్రీనివాస్ కుమార్ జెండా ఊపి ప్రారంబించారు. ప్రజలకు షుగర్ వ్యాది పట్ల అవగాహన కోసం ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని ఏసిపి అన్నారు. మధుమేహ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని పిలుపునిచ్చారు. మధుమేహం నివారణ కోసం యోగా వ్యాయామం, వాకింగ్ ...
Read More »ఘనంగా నెహ్రూ జయంతి
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కాంగ్రేస్ పార్టీ కార్యాలయం వద్ద జవహార్ లాల్ నెహ్రు మాజీ ప్రధాన మంత్రి 135 వ జయంతిని పురస్కరించుకొని పూల మాలలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పండ్ల రాజు, చాట్ల రాజేశ్వర్, చింతల గంగాధర్, గోనె శ్రీనివాస్, విష్ణు, మల్లేశ్, ప్రసాద్, శ్రీధర్, మోహన్, అంజద్ తదితరులు పాల్గొన్నారు.
Read More »చెక్‌పోస్టుల వద్ద తహసిల్దార్ కార్యాలయాలలో బందోబస్తు
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద, తహశీల్ కార్యాలయాల్లో బందోబస్తుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పోలీస్ అధికారులకు తెలిపారు. గురువారం తన చాంబర్లో పోలీస్ కమిషనర్ కార్తికేయ, రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున, మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే కనీస మద్దతు ధర ...
Read More »