Breaking News

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

నిజామాబాద్‌, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో గురువారం నిజామాబాదు నగరంలోని వి.ఎన్‌.ఆర్‌. పాఠశాలలో బాలల దినోత్సవ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విచిత్ర వేషధారణ, ఏక్‌ మినట్‌, మ్యూజికల్‌ చైర్‌ తదితర పోటీలు నిర్వహించారు. విచిత్ర వేషధారణ పోటీలో పాల్గొన్న చిన్నారులు నెహ్రూ, సైనికుడు, డాక్టర్‌, స్పైడర్‌ మెన్‌ వేషాల్లో ఆకట్టుకున్నారు.

కార్యక్రమానికి లయన్స్‌ జిల్లా జీఎస్టీ కో ఆర్డినేటర్‌ గంధాని శ్రీనివాస్‌ ముఖ్యఅతిధిగా హాజరై విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా సాంస్కతిక పోటీలలో పాల్గొనాలని సూచించారు.

కార్యక్రమంలో లయన్స్‌ రీజియన్‌, జోన్‌ చైర్మెన్లు గోపాల్‌ దాస్‌ అగర్వాల్‌, ద్వారకా దాస్‌ అగర్వాల్‌, జిల్లా అదనపు కార్యదర్శి కరిపె రవీందర్‌, ఇందూర్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్‌, కార్యదర్శి చింతల గంగాదాస్‌, కోశాధికారి సిలివేరి గణేష్‌, వీఎన్నార్‌ పాఠశాల కరస్పాండెంట్‌ యాదేశ్‌ గౌడ్‌, ప్రిన్సిపాల్‌ శ్రీహరి, రమేష్‌, పొలాస సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 63వ వర్ధంతిని ఎల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *