Breaking News

వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి

కామారెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రాజీవ్‌ పార్క్‌ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, పార్కులో బోరు పని చేయక బాత్రూంలో నీళ్లు లేక దుర్వాసన వస్తుందని వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లాకలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్క్‌ ముందర చెత్త కుప్పలు, కలేబరాలు, అపరిశుభ్రమైన వాతావరణం ఉందన్నారు. కామారెడ్డి అధికారులు రాశివనంపై చూపించిన ప్రేమలో ఒక్క శాతం కూడా రాజీవ్‌ పార్క్‌ పైన చూపించినా, ఉదయం వాకింగ్‌ వచ్చేవారికి, సందర్శకులకు పరిశుభ్రమైన వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ విషయంలో ఇప్పటివరకు మున్సిపల్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఒకవేళ 17వ తేదీ ఆదివారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతే రాజీవ్‌ పార్క్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Check Also

జిల్లాస్థాయి గణిత పోటీలలో రెంజల్‌ విద్యార్థులు

రెంజల్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 47వ జవహర్‌ లాల్‌ నెహ్రూ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *