Breaking News

Daily Archives: November 15, 2019

24న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలలో ఈనెల 24వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసినట్టు ప్రిన్సిపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2004-05 నుంచి 2018-19 వరకు పదవ తరగతి చదివిన విద్యార్థులు, వారికి విద్యాబోదన చేసిన ఉపాధ్యాయులు, పూర్వ ప్రధానాచార్యులు సమ్మేళనానికి హాజరవుతున్నట్టు చెప్పారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన విద్యార్థులు ఇక్కడి పాఠశాలలో చదివిన వారిలో కొందరు ఉద్యోగాలలో స్థిరపడ్డారని, మరికొందరు ...

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

బీర్కూర్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నసురుల్లాబాద్‌ మండలంలోని హజీపూర్‌ గ్రామ పంచాయితీలో లయన్స్‌ కంటి ఆసుపత్రి బాన్సువాడ వారి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎంపీపీ పి.విట్ఠల్‌, సర్పంచ్‌ అరిగే చంటి కంటి శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌లు విట్ఠల్‌, సాయగౌడ్‌, మాజి జడ్పీటీసీ కిషన్‌ నాయక్‌, సెక్రటరీ రజిత, కాశిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

చెక్‌ పోస్ట్‌ వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలి

రెంజల్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొరుగున మహారాష్ట్ర నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా చెక్‌పోస్టు వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలోని కందకుర్తి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్ట్‌ను బోధన్‌ ఆర్డీవో గోపిరామ్‌ రాథోడ్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహారాష్ట్ర ప్రాంతం నుండి ధాన్యాన్ని జిల్లాలోకి దిగుమతి చేస్తున్నారని వీటిని అరికట్టేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. చెక్‌పోస్టులవద్ద పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఉండాలని, ...

Read More »

మహిళ దుర్మరణం

ఆర్మూర్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన పద్మ అనే మహిళ దుర్మరణం చెందింది. వివరాల్లోకి వెళితే పద్మ అనే మహిళ తన సొంత పనులు చేసుకొని ఇంటికి వెళ్ళే క్రమంలో ఆర్మూర్‌ బస్టాండ్‌ ఎదురుగా గల గీతాభవన్‌ ఉడిపి హోటల్‌ ముందు నుండి నడుచుకుంటూ వెళ్తుండగా బాల్కొండ నుండి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న పెళ్ళి బస్సు మహిళను వెనుక నుండి ఢీ కొట్టింది. దాదాపు ...

Read More »

ఆర్టీసీ సమ్మె పట్ల కేసీఆర్‌ మొండివైఖరి విడనాడాలి

ఆర్మూర్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొండి వైఖరి విడనాడి ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతి శీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్టియు) జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి దాసు డిమాండ్‌ చేశారు. కెసిఆర్‌ మొండితనం వల్ల ఆర్టీసీ సమ్మె 42 రోజులు అవుతుందని ఆయన అన్నారు. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమంలో చెప్పిన మాటలకు విరుద్ధ పాలన తెలంగాణలో కొనసాగుతుందని ఆయన అన్నారు. తెగింపుతో తెలంగాణ రాష్ట్రం కోసం సకల ...

Read More »

అశ్వద్దామరెడ్డి ప్రకటనను ఎంసిపిఐయు వ్యతిరేకిస్తుంది

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నలభై మూడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రధాన డిమాండ్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఈ అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వద్ధామ రెడ్డి చేసిన ప్రకటనను ఎంసిపిఐ పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం అన్నారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంసిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ...

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

రెంజల్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామానికి చెందిన మాజీ పట్వారి రామచంద్రరావు ఈ నెల 9 న మతి చెందారు. కాగా ఆయన కుటుంబాన్ని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ శుక్రవారం పరామర్శించారు. మతికి గల వివరాలు కుమారుడు సుదీర్‌నీ అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టిఆర్‌ఎస్‌ నాయకులు రఫీక్‌, మౌలానా, రవీందర్‌ గౌడ్‌, లింగం, విజయ్‌ యాదవ్‌, అన్వర్‌, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Read More »

త్రివేణి సంగమానికి భక్తుల తాకిడి

రెంజల్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్తీకమాసాన్ని పురస్కరించుకొని మండలంలోని కందకుర్తి గోదావరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండి భక్తులు గోదావరికి చేరుకొని నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. గోదావరి పరివాహక ప్రాంతమైన కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పిండివంటలు నైవేద్యంగా చేసి దీపాలు వెలిగించి తెప్పలను గోదావరి నదిలో వదిలారు. పవిత్ర శుక్రవారం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కందకుర్తి శివాలయంలో పూజలు నిర్వహించి ...

Read More »

చెక్కుల పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన 25.05 లక్షల రూపాయల చెక్కులను 17 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శుక్రవారం అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 18.07 లక్షల రూపాయల చెక్కులను 19 మందికి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1.60 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట పలువురు తెరాస ...

Read More »