Breaking News

24న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నిజామాబాద్‌, నవంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలలో ఈనెల 24వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసినట్టు ప్రిన్సిపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

2004-05 నుంచి 2018-19 వరకు పదవ తరగతి చదివిన విద్యార్థులు, వారికి విద్యాబోదన చేసిన ఉపాధ్యాయులు, పూర్వ ప్రధానాచార్యులు సమ్మేళనానికి హాజరవుతున్నట్టు చెప్పారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన విద్యార్థులు ఇక్కడి పాఠశాలలో చదివిన వారిలో కొందరు ఉద్యోగాలలో స్థిరపడ్డారని, మరికొందరు ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారన్నారు.

కార్యక్రమానికి తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ గౌరవ కార్యదర్శి ఎ.సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తారన్నారు. అదేవిధంగా విశిష్ట అతిథిగా జడ్పి వైస్‌ఛైర్మన్‌ రజిత యాదవ్‌ విచ్చేస్తారన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే పూర్వ విద్యార్థులు రెండురోజుల ముందుగా తమకు సమాచారం అందించాలన్నారు. మరిన్ని వివరాలకు 9866559697, 9177778263 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Check Also

కొత్త వ్యక్తులు వస్తే పోలీసుల‌కు సమాచారం ఇవ్వండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనం కరోనా అనే కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని అనుక్షణం ...

Comment on the article