Breaking News

చెక్కుల పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన 25.05 లక్షల రూపాయల చెక్కులను 17 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శుక్రవారం అందజేశారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 18.07 లక్షల రూపాయల చెక్కులను 19 మందికి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1.60 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట పలువురు తెరాస నాయకులు ఉన్నారు.

Check Also

కందకుర్తి శాఖా వార్షికోత్సవం

బోధన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కందకుర్తి శాఖా వార్షికోత్సవాన్ని గురువారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *