Breaking News

కొడవలి చేతపట్టి వరి కోసిన ఎమ్మెల్యే

రెంజల్‌, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ తన సొంత వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న వరి పంటను తానే స్వయంగా కొడవలి చేతపట్టి వరి ధాన్యాన్ని కోసి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ స్వయంగా వరి కోయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే కూడా తన సొంత వ్యవసాయ క్షేత్రంలో సామాన్య రైతుగా వరి కోతను ప్రారంభించడం ఆనందంగా ఉందని రైతులు టిఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమేష్‌, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు లతీఫ్‌, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, సాటాపూర్‌ సర్పంచ్‌ వికార్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు రఫిక్‌, రాఘవేందర్‌, మైని మోహన్‌, కుర్మె సాయిలు, నరేంధర్‌, నరేష్‌, కిషోర్‌ తదితరులు ఉన్నారు.

Check Also

గణతంత్ర వేడుకలు ఘనంగా ఉండాలి

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర వేడుకలను ఆకట్టుకునే విధంగా ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *