Breaking News

ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం

రెంజల్‌, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షం కారణంగా తడిసిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ అన్నారు. శనివారం రెంజల్‌ గ్రామంలో నష్టపోయిన వరి పంటను పరిశీలించారు. పంట నష్టానికి గల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి కోత యంత్రాన్ని స్వయంగా నడిపి తన సొంత పొలంలో వరి కోత ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు అధైర్య పడకుండా ఉండాలని ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తడిసిన ప్రతి ధాన్యపు గింజలు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందజేస్తుందని అన్నారు.

రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎల్లవేళలా ముందుంటారన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పెద్దపీట వేశారని, రైతు శ్రేయస్సు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు భూమరెడ్డి, రవీందర్‌ గౌడ్‌, సర్పంచ్‌లు రమేష్‌, వికార్‌, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు లతీఫ్‌, టిఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ నాయకుడు రజాక్‌, రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యుడు మౌలానా, జాగతి మండల అధ్యక్షుడు నీరడి రమేష్‌, విండో చైర్మన్‌ మొహినోద్దీన్‌, రఫిక్‌, అన్వర్‌, లింగం, షబ్బీర్‌, రాము, నరేంధర్‌ తదితరులు ఉన్నారు.

Check Also

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 63వ వర్ధంతిని ఎల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *