Breaking News

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

నిజామాబాద్‌, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలపడానికి వెళ్ళిన ఏఐటియుసి జిల్లా ప్రదాన కార్యదర్శి వై.ఓమయ్యను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడుపుతుందన్నారు. 43 రోజులుగా ఆర్‌టిసి కార్మికులు సమ్మె చేస్తుంటే పట్టించుకోక పోగా, కార్మిక సంఘాల నాయకులతో చర్చించక పోగా, శాంతి యుతంగా గాందేయ మార్గంలొ సమ్మె చేస్తూ కార్మిక సంఘాల నాయకులు ప్రధాన డిమాండ్‌ అయిన ఆర్‌టిసిని ప్రభుత్వంలొ విలీనాన్ని పక్కన పెట్టినా కూడా చర్చలకు పిలవక పోవడం బాధాకరమనానరు.

అక్రమ అరెస్టులతొ ఉద్యమాలను ఆపలేరన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నాయకత్వాన్ని చర్చలకు పిలవాలని, అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Check Also

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 63వ వర్ధంతిని ఎల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *