Breaking News

Daily Archives: November 18, 2019

బహిరంగ ప్రదేశాల్లో దూమపానం చేయరాదు

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తులు, దూమపానం చేయరాదని, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, విద్యాలయాలు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ తదితర ప్రాంతాల్లో పొగతాగవద్దని, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం కామారెడ్డి జనహిత భవనంలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమ జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ ప్రాంతం పొగాకు రహితంగా నిర్దేశించడమైనది’ అనే బోర్డులు ఏర్పాటు చేయించాలని సూచించారు. ...

Read More »

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌టిసి కార్మికులకు మద్దతుగా 46వ రోజు సడక్‌ బంద్‌కు వెళ్లకుండా ఇంటి వద్ద ఏఐటియుసి జిల్లా కార్యదర్శ ఎల్‌.దశరథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా దశరథ్‌ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని అన్నారు.

Read More »

గౌరీ శంకర ఆలయంలో ప్రత్యేక పూజలు

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా శ్రీ గౌరీ శంకర ఆలయం గాయత్రీ విద్యుత్‌ నగర్‌ దేవునిపల్లిలో కార్తీక మాసం సందర్భంగా అభిషేకములు, అన్నపూజ నిర్వహించారు. ఆలయ పూజారి నరసింహరావు పంతులు ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో మహిళలు స్వామివారిని పూజించి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో సంధ్య, శ్రీలత, సుధా, మమత, విమల, స్వరూప తదితరులున్నారు.

Read More »

సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా వికార్‌ పాషా

రెంజల్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడిగా రెంజల్‌ మండలం సాటాపూర్‌ గ్రామ సర్పంచ్‌ వికార్‌ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సంఘం సమావేశంలో నూతన కమిటీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వికార్‌ పాషా మాట్లాడుతూ జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు సర్పంచులందరికి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయసహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ అందరికి అందుబాటులో వుంటానన్నారు.

Read More »

విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్దం

నందిపేట్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం కౌల్‌పూర్‌ గ్రామ పరిధిలో ఎన్టీఆర్‌ కాలోనిలో బత్తుల ప్రసాద్‌ ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్కూట్‌తో ఇల్లు దగ్దమైంది. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనలో మూడు లక్షల రూపాయలు, 5 తులాల బంగారం, ఇంట్లో టివి, ఫర్నీచర్‌, పూర్తిగా బట్టలు దగ్దమయ్యాయి.

Read More »

ప్రముఖ వైద్యులు వనం దేవిదాస్‌ మృతి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లాకు చెందిన సీనియర్‌ వైద్యులు, సామాజిక సేవకులు డాక్టర్‌ వనం దేవిదాస్‌ (81) మరణించారు. నిజామాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన కన్నుమూశారు. నిజామాబాదులో మంచి సర్జన్‌గా పేరున్న డాక్టర్‌ దేవిదాస్‌ వైద్యవత్తి కొనసాగిస్తూనే సామాజిక స్వచ్చంద సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని అందరి మన్ననలు పొందారు. డాక్టర్‌ దేవిదాస్‌ తన భార్య వనం చంద్రసేన పేరిట పేదల పెళ్ళిళ్ళ కోసం వందలాది మందికి పుస్తెమట్టెలు ...

Read More »

ఆర్‌టిసి సమ్మెకు మద్దతుగా ట్రాన్స్‌ జెండర్‌ వెల్పేర్‌ సొసైటీ

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ట్రాన్స్‌ జెండర్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికింది. సోమవారం నిజామాబాదులో జరుగుతున్న ఆర్టీసి దీక్షా శిబిరానికి సొసైటీ సభ్యులు వచ్చి మద్దతు తెలిపారు. బిక్షమెత్తి సేకరించిన రూ.2 వేలు ఆర్టీసి కార్మికులకు ట్రాన్స్‌ జెండర్లు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ట్రాన్స్‌ జెండర్‌ వెల్ఫేర్‌ సొసైటీ నాయకులు అలక, జరీనా, గంగా, రక్ష తదితరులు పాల్గొన్నారు.

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ అందజేత

ఆర్మూర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బండి లక్ష్మన్‌ కుమారుడు మెదడు వాపు వ్యాధితో బాధ పడుతున్నాడు. హాస్పిటల్‌ చికిత్స ఖర్చులకు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సహయంతో సియం రిలీఫ్‌ ఫండు ద్వారా 60 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన చెక్కును సోమవారం అందజేశారు. కార్యక్రమంలో కునింటి రవి, సర్పంచ్‌, వార్డ్‌ సభ్యులు చిన్న రెడ్డి, మల్ల రెడ్డి, తెరాస కార్యకర్తలు లోక లక్ష్మణ్‌, బోర్‌ రాజా రెడ్డి, విట్టం విట్ఠల్‌, బండి రాజు, ...

Read More »

జనవరి 8 నుండి వైదిక పురోహిత శిబిరము

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్షగురుకులము-బ్రాహ్మమహావిద్యాలయము ఆధ్వర్యంలో పూజ్య శ్రీ స్వామి బ్రహ్మానంద సరస్వతి అధ్యక్షతలో వైదిక పురోహిత శివిరము ఏర్పాటు చేసినట్టు ఆచార్య వేదమిత్ర ఒక ప్రకటనలో తెలిపారు. తిథి:పుష్య శుక్ల త్రయోదశి బుధవారము నుండి పుష్య కష్ణ ద్వితీయ ఆదివారము వరకు అనగా 8 జనవరి నుండి 12 జనవరి వరకు శిబిరం ఉంటుందన్నారు. 18 సంవత్సరాలు ఆ పైబడిన వారు పాల్గొనవచ్చని శిబిరంలో వసతి, భోజనం ఉచితంగా అందజేయబడుతుందన్నారు. మరిన్ని వివరాలకు 9848853383 నెంబర్‌లో ...

Read More »

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌ ఉండకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించి పెండింగ్‌ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పలు విషయాలపై అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆస్తుల వివరాలను ఇప్పటికే శాఖలను కోరడం జరిగిందని, వెంటనే నివేదికలను అందించాలని ఆయన ...

Read More »