Breaking News

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌ ఉండకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించి పెండింగ్‌ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పలు విషయాలపై అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆస్తుల వివరాలను ఇప్పటికే శాఖలను కోరడం జరిగిందని, వెంటనే నివేదికలను అందించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా శాఖలు నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల వివరాలు, కలెక్టర్‌ సంతకంతో కూడిన జాయింట్‌ ఎకౌంటు బ్యాంకు ఖాతాల వివరాలను సోమవారం వరకు ఆయా ఖాతాల్లో నిల్వ ఉన్న నిధుల మొత్తం వివరాలను ఆ ఖాతా ఎందు గురించి తెరిచారో, ప్రస్తుత పరిస్థితి ఏమిటో అన్ని వివరాలతో వెంటనే కలెక్టరేట్‌ ద్వారా అందజేసిన ప్రొఫార్మాలో నివేదిక సమర్పించాలన్నారు.

ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్‌ శాఖలు, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, డిఆర్‌డిఓ, తదితర శాఖలతో పాటు మిగతా అన్ని శాఖల అధికారులు బ్యాంకు ఖాతాల వివరాలు జమ ఉన్న నిధుల వివరాలు తెలపాలన్నారు. ఎస్సీ, ఎస్‌టీ, బిసి, మైనార్టీ విద్యాసంస్థలు, వసతి గహాలు, విద్యాశాఖ సంస్థలలో విద్యార్థులకు అందిస్తున్న ఇతర సదుపాయాలు పూర్తి వివరాలను సమర్పించాలన్నారు.

కోర్టు కేసుల వివరాలను సమర్పించ వలసిందిగా ఇదివరకే కోరడం జరిగిందని వివరాలు సమర్పించే సమయంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, పేరా వారీగా సమాధానాలు, కేసు ప్రస్తుత పరిస్థితి, ఇతర వివరాలను తెలియజేయాలన్నారు. కలెక్టరేట్‌కు ఫైల్స్‌ పంపేముందు నియమ నిబంధనలు తెలియజేయాలని అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని నోట్‌ ఫైల్స్‌ పూర్తి వివరాలు తెలపాలని ఆదేశించారు.

అదేవిధంగా నెలల కొద్దీ ఫైల్స్‌ పెండింగ్లో ఉండకూడదని ముఖ్యంగా ఇంజనీరింగ్‌ శాఖలు ఈ విషయమై నిర్ణీత సమయంలో ఫైల్స్‌ సర్కులేట్‌ చేయాలని ఆదేశించారు. పనుల అంచనాలకు సంబంధించి సాంకేతిక మంజురీ ఇచ్చిన తర్వాతనే పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ప్రజావాణిలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఓ రమేష్‌, జిల్లా పరిషత్‌ సీఈవో గోవిందు, రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 63వ వర్ధంతిని ఎల్లారెడ్డి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *