Breaking News

Daily Archives: November 19, 2019

తెలంగాణ పాఠశాలల్లో త్వరలోనే ‘నీటి గంటలు’

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పాఠశాలల్లో త్వరలోనే ‘నీటి గంటలు’ మ్రోగనున్నాయి. విద్యార్ధులు నీళ్ళు త్రాగకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించిన కేరళ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రతీ పాఠశాలలో నిర్ధిష్ట సమయంలో రోజుకు మూడుసార్లు గంట మ్రోగించి విద్యార్దులందరూ తప్పనిసరిగా నీళ్ళు త్రాగేలా చేస్తోంది. అది చూసి కర్ణాటక ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అమలుచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలో ‘నీటి గంటలు’ మ్రోగించాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి ...

Read More »

చేతి సంచుల పంపిణీ అభినందనీయం

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యవైశ్య అఫీషియల్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ నిర్మూలనలో భాగంగా బట్ట సంచుల పంపిణీ చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ చేతుల మీదుగా వీటిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు సంతోష్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, ఆర్థిక కార్యదర్శి గంగా ప్రసాద్‌లతో పాటుగా మహేష్‌, సంతోష్‌, బాలయ్య, శేఖర్‌, సుబ్బారావు, సంతోష్‌, బాలాజీ, మురళి, రమేష్‌ సుధాకర్‌, పవన్‌ పాల్గొన్నారు. ఈ ...

Read More »

రూ. 14.32 కోట్లు పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 165 మంది లబ్ధిదారులకు మంగళవారం సుమారు 1 కోటి 65 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో గత 11 నెలల్లో 1470 మంది లబ్ధిదారులకు 14 కోట్ల 32 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభరక్‌ చెక్కులు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట పలువురు తెరాస నాయకులు ఉన్నారు.

Read More »

సమస్యలు లేకుండా ధాన్యం సేకరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు రబీకి ఎరువులను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, సహకార మార్క్‌ఫెడ్‌ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రబీకి కావలసిన ఎరువులపై ముందుగానే ఇండెంట్‌ పంపించాలని, సాగు విస్తీర్ణాన్ని దష్టిలో పెట్టుకొని ఎరువులు తక్కువ కాకుండా పంపేలా ప్రభుత్వానికి నివేదిక పంపించాలన్నారు. ...

Read More »

బ్రాహ్మణుల అభివద్ధికి కషి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్రాహ్మణ పరిషత్‌ చైర్మన్‌గానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా వారి అభివద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్‌ చైర్మన్‌, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి తెలిపారు. మంగళవారం డిచ్‌పల్లి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రమణాచారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితులుగా ఉంటూ బ్రాహ్మణులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయటానికి ముఖ్యమంత్రి చేత ఆదేశాలు జారీ చేయడం తను సాధించిన ...

Read More »

బిసి రుణాలు మంజూరు చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీసీ కార్పొరేషన్‌ లోన్‌ వెంటనే మంజూరు చేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా కో కన్వీనర్‌ దువ్వాలనరేశ్‌ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో బిసి కార్పొరేషన్‌ అధికారి జన్సీరాణికి వినతిపత్రం అందజేశారు. 2017, 2018 లో బిసి కార్పొరేషన్‌ లోన్‌ కొరకు దరకాస్తు చేసుకున్న వారికి ఇంత వరకు లోన్‌ మంజూరు కాలేదన్నారు. ఈ విషయమై పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయానికి వెళితే ...

Read More »

ఆర్‌టిసి కార్మికులకు బియ్యం పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న నిజామాబాద్‌ 1,2 డిపోలకు చెందిన ఆర్టీసి కార్మికులకు నిజామాబాదు జేఏసి ఆద్వర్యంలో మంగళవారం 10కిలోల చొప్పున 20 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఏసి నాయకులు భాస్కర్‌, యాదగిరి, వనమాల కష్ణ, వి.ప్రభాకర్‌, దండి వెంకట్‌, రమేష్‌ బాబు, సుధాకర్‌, వి.గోదావరి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాదు దర్నా చౌక్‌లో ఆర్టీసీ కార్మికుల దీక్షలు 46వ రోజు కూడా కొనసాగాయి. మంగళవారం ...

Read More »

ప్రతి ఒక్కరు సోదరభావాన్ని అలవరుచుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరూ సోదరభావాన్ని అలవర్చుకోవాలని వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ శిక్షణ విభాగం జాతీయ సమన్వయకర్త, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి ఉద్బోదించారు. వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ ఆద్వర్యంలో మంగళవారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నిజామాబాదు నగరంలోని ఎస్‌వి డిగ్రీ కళాశాలలో జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీహరి ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు. భిన్న మతాలు సంస్క తులకు నిలయం భారత దేశం అని చెప్పారు. ...

Read More »

ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని రాజారాం స్టేడియంలో ద్వితీయ గంగారెడ్డి మెమోరియల్‌ ఇంటర్‌ స్కూల్‌ టోర్నమెంటును ఐఎంఏ మాజీ అధ్యక్షురాలు డాక్టర్‌ కవితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కవితారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో అద్భుతమైన నైపుణ్యం ఉందని నైపుణ్యాన్ని వెలికితీసే భాగంలో కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ, గంగారెడ్డి మెమోరియల్‌ ట్రస్టు వారు కలిసి ఇంటర్‌ స్కూల్‌ టోర్నమెంటును గత రెండు సంవత్సరాలుగా నిర్వహించడం చాలా హర్షణీయమన్నారు. విద్యార్థులు ఆటల్లో వారి సమయాన్ని కేటాయిస్తే ...

Read More »