Breaking News

పారిశుద్య, యాంటీ లార్వా పనులు కొనసాగాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారిశుద్ధ్య కార్యక్రమాలు, యాంటీ లార్వా పనులు కొనసాగించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మున్సిపల్‌, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్లో మున్సిపల్‌ అధికారులు, వైద్యశాఖ అధికారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిటీ శానిటేషన్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఎందుకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తిస్థాయి నివేదిక చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా డెంగ్యూ, మలేరియా వ్యాధులు విస్తరించకుండా స్వైన్‌ ఫ్ల్యూ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అన్ని మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు రెగ్యులర్‌గా నిర్వహించాలని మోరీలు శుభ్రంచేసి చెత్తను డంపింగ్‌ యార్డ్‌లకు తరలించాలని, ఎక్కడ కూడా మోరీలు చెత్త ప్లాస్టిక్‌ కనిపించకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌ వాడకం చాలావరకు తగ్గినప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గించడానికి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఉపయోగించేవారికి జరిమానా విధించాలన్నారు. ప్రతి 6 రోజులకోసారి అయినా మళ్లీ సైకిల్‌ వచ్చేలా యాంటీ లార్వా కార్యక్రమాలతోపాటు ఫాగింగ్‌ నిర్వహించాలని తెలిపారు. స్వైన్‌ ఫ్లూ మన జిల్లాలో ఉన్నట్లు ఇప్పటివరకు ఎటువంటి అనుమానిత కేసులు నమోదు కాలేదని అయితే ముందు జాగ్రత్తగా అంటు వ్యాధిపై ప్రజలకు లోకల్‌ టీవీలలో, సిడిల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ఏమైనా అనుమానిత కేసులు ఆస్పత్రులకు వస్తే వెంటనే చర్యలు తీసుకోవడానికి ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని ఒక వెంటిలేటర్‌ కూడా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. మున్సిపాలిటీలో ఇంకా ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటే అందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుదర్శనం, మున్సిపల్‌ కమిషనర్లు శైలజ, గంగాధర్‌, స్వామి, ఎంఇ.ఆనంద్‌ సాగర్‌, ఎమ్‌హెచ్‌ ఓ సాజిద్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు అల‌ర్ట్‌

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల‌ని ...

Comment on the article