నిజాంసాగర్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత మూడు రోజుల నుండి కొనసాగుతున్న వీరభద్రుని ఉత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. ప్రతి యేడు లాగా ఉత్సవాలు పెద్దఎత్తున జరిగాయి. అన్నదానంలో భక్తులు పాల్గొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు వచ్చారు. శుక్రవారం అగ్నిగుండంలో పిల్లలు, పెద్దలు నడిచారు. అలా నడవడం వల్ల కోరికలు నెరువేరుతాయని భక్తుల నమ్మకం. పెళ్లి కాని వారికి పెళ్లి, పిల్లలు పుట్టని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ పూజారి సంగయ్యప్ప, శివప్పలు వంశ ...
Read More »Daily Archives: November 22, 2019
గురుకుల విద్యార్థులకు అస్వస్థత
నిజాంసాగర్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆస్పత్రిలో సిబ్బంది వైద్యులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు గంటల అనంతరం వైద్యులు వచ్చి ప్రథమ చికిత్స చేపట్టారు. విషయం తెలుసుకున్న బిచ్కుంద ఎంపిపి అశోక్ పటేల్ విద్యార్థులను పరామర్శించారు. ...
Read More »అనారోగ్యంతో యువకుడు మృతి
నిజాంసాగర్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గడ్డం రాజు (24) అనే యువకుడు గురువారం రాత్రి మతి చెందాడు. గ్రామస్తులు తెలిసిన వివరాల ప్రకారం గత నాలుగు రోజుల నుంచి రాజుకు మెదడు వాపు నరాలతో బాధపడుతుండగా గురువారం ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆరోగ్యం మరింత విషమించడంతో గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మతి చెందినట్లు తెలిపారు.
Read More »ఆపద్బంధు చెక్కు అందజేత
రెంజల్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మతి చెందడంతో ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.50 వేల ఆపద్బందు చెక్కును మతుడి భార్య లక్ష్మీకి శుక్రవారం తహసీల్దార్ అసాదుల్లా ఖాన్ అందజేశారు.
Read More »రైతులు దళారులను ఆశ్రయించద్దు
రెంజల్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని తహసీల్దార్ అసాదుల్లా ఖాన్ అన్నారు. శుక్రవారం మండలంలోని నీలా గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అన్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని, ప్రభుత్వ మద్దతు ధర ”ఏ” గ్రేడ్ ...
Read More »వ్యవసాయ అభివద్ధిలో డీలర్లు భాగస్వాములు కావాలి
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రసాయన ఎరువులు మోతాదు వరకే వాడేలా మరియు రైతులు అభివద్ధిలో పయనించేలా డీలర్లు కూడా తమ వంతుగా సలహాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు శిక్షణ పూర్తి చేసుకున్న డీలర్లకు సూచించారు. ఇక్రిసాట్, రుద్రూర్‌లలో వ్యవసాయ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఇన్పుట్ డీలర్షిప్ లో 48 వారాలు శిక్షణ పూర్తిచేసుకున్న సందర్భంగా ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ప్రగతి భవన్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా కలెక్టర్ ...
Read More »ప్రయివేటు కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖిల భారత ప్రగతి శీల విద్యార్థి సంఘం (ఏఐపిఎస్‌యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జ్వాల మాట్లాడుతూ జిల్లాలోని అనేక ప్రవేట్ డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షల ఫీజులు మాత్రమే తీసకోవాలి కానీ అదనంగా విద్యార్థుల నుంచి పరీక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజి సంబంధించిన ఫీజులు కట్టాలని లేదంటే సెమిస్టర్ ...
Read More »వచ్చిన ధాన్యాన్ని కొనడానికి అన్ని చర్యలు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలకు వచ్చే వరి ధాన్యం అంతా కూడా ఖరీదు చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో సంయుక్త కలెక్టర్ సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన ధాన్యం పూర్తిగా కొనడానికి ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇందుకై ఇంకా అనుమతులు రావాల్సి ఉంటే ప్రతిపాదనలు పంపి అనుమతులు పొందాలని తెలిపారు. ...
Read More »వైబ్రంట్స్ ఆఫ్ కలామ్ స్వచ్చంద సంస్థ నూతన కార్యవర్గం
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైబ్రంట్స్ ఆఫ్ కలామ్ స్వచ్చంద సంస్థ కార్యవర్గ సమావేశం శుక్రవారం నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్లో జరిగింది. సమావేశానికి సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో సంస్థ కార్యకలాపాలు సంత ప్తికరంగా సాగుతున్నాయన్నారు. సంస్థ కార్యకలాపాలు మరింత విస్తత పర్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో నూతన నియామకాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నిజామాబాదు జిల్లాకు చెందిన తిరునగరి శ్రీహరిని వైబ్రెంట్స్ ఆఫ్ ...
Read More »సిహెచ్. కొండూరుకు సిఎం సతీమణి
నందిపేట్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సియం కేసిఆర్ సతీమణి శోభా నందిపేట్ మండలంలోని సి.హెచ్ కొండూర్ గ్రామానికి శుక్రవారం పర్యటన చేశారు. సిహెచ్ కొండూరు గ్రామంలో కెసిఆర్ ఆల్లుడు ప్రకాష్ రావు నూతన గహప్రవేశానికి వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వాగతం పలికి ఆమెను గ్రామానికి తీసుకెళ్లారు. పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, కార్యకర్తలు, నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నందిపేట్ మండల అధ్యక్షులు నక్కల భూమేష్, మండల ఎంపిపి సంతోష్, సిహెచ్ కొండూరు గ్రామ ...
Read More »వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
నందిపేట్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఒక లక్షా 20 వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకర్‌ను మిషన్ భగీరథ – రూరల్ వాటర్ స్కీమ్ ద్వారా నిర్మిస్తున్నారు. రూ. 40 వేల అంచనా వ్యయంతో చేపడుతున్న భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం కొరకు శుక్రవారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజు ...
Read More »బంగారు వారి పెళ్లికి ప్రముఖులు
నందిపేట్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలోని నూత్పల్లి గ్రామ తెరాస ప్రముఖ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ కుమారుని వివాహ మహోత్సవానికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రముఖులు హాజరైనారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేస్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, గడుగు గంగాధర్, కేశ వేణు తదితరులు పాల్గొని వధూ వరులను ఆశీర్వదించారు.
Read More »