Breaking News

Daily Archives: November 25, 2019

ఉచిత బిపి, షుగర్‌ పరీక్షలు

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ వారి అధ్వర్యంలో సోమవారం నుండి 5 రోజుల వరకు కల్కినగర్‌ కాలనీలో 30 సంవత్సరాలు వయసు పైబడిన వారికి ఉచిత బిపి షుగర్‌ పరీక్షలు చేయనున్నారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు వెంకటేష్‌, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Read More »

ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే పోరాటానికి సిద్ధమవుతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లాలోని రామరెడ్డి మండలంలో సీపీఐ పార్టీ 2వ మహాసభలు నిర్వహించారు. సభకు అధ్యక్షతగా సీపీఐ రామరెడ్డి మండల అధ్యక్షత కసిం వ్యవహరించారు. ఈ సందర్భంగా పశ్యపద్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. అంతే ...

Read More »

గుర్తుతెలియని మహిళ శవం లభ్యం

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం మథడి పెద్ద చెరువు కాలువలో గుర్తుతెలియని మహిళ శవాన్ని పోలీసులు గుర్తించారు. మహిళ వయసు 25 నుండి 40 మధ్య ఉంటుందని, అయితే శవానికి తల లేకుండా కేవలం శరీరం మాత్రమే ఉందని, వారం రోజులక్రితం చంపివేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా కామారెడ్డి ఎస్‌హెచ్‌వోను సంప్రదించాలన్నారు.

Read More »

విద్యార్థినులు భయపడవలసిన అవసరం లేదు

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజన వసతి గహంలో జరిగిన అస్వస్థత సంఘటనపై విద్యార్థినులు భయపడవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ధైర్యం చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన సంబంధిత అధికారులతో కలిసి నాగారం గిరిజన డిగ్రీ విద్యార్థినుల వసతిగహాన్ని సందర్శించారు. వంటగదిని, గది లోని వస్తువులను సామాగ్రిని కూరగాయలను, బియ్యాన్ని పరిశీలించారు. వసతి గహం తిరిగి చూసి వసతులను గమనించారు. అక్కడ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్‌ క్యాంపు పరిశీలించారు. వసతి ...

Read More »

పిడిఎస్‌యు సభ్యత్వ నమోదు

ఆర్మూర్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్‌యు ఆర్మూర్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలోని వివిధ కళాశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌ నాయకులు అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సమాజంలో అసమానతలు పోవాలని, సమసమాజం రావాలని ఆ దిశగా సాగే పోరాటాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి స్పూర్తితో ఆయన ఆశయాల ...

Read More »

ఘనంగా పార్వతి పరమేశ్వరుల కళ్యాణం

బాన్సువాడ, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. రాజాగౌడ్‌ దంపతులు కార్యక్రమానికి పెద్దలుగా వ్యవహరించగా దేవాలయం ఆవరణలో పార్వతి పరమేశ్వరుల విగ్రహాలకు బ్రహ్మశ్రీ జపాల భాస్కర్‌ శర్మ, చంద్ర శేఖర్‌ శర్మ, పాండురంగ శర్మ, సోను పంతులు, శ్రీనివాస్‌ శర్మల వేదమంత్రోచ్ఛరణల మద్య మహిళా భక్తులు, అయ్యప్పస్వామి దీక్ష స్వాముల సమక్షంలో కళ్యాణం జరిపారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. ...

Read More »

రాష్ట్ర కమిటీలో జిల్లా ప్రతినిధులకు స్థానం

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర కమిటీలో నిజామాబాద్‌ జిల్లా వాసులకు చోటు దక్కింది. సంఘం రాష్ట్ర 2వ మహాసభలు భద్రాద్రీ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగాయి. సభలలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులుగా తోపునూరి చక్రపాణి, రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొండ గంగాధర్‌, చామంతి లక్ష్మిలకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీకి ఉపాద్యక్షులు చక్రపాణి ధన్యవాదములు తెలిపారు.

Read More »

కళాశాల విద్యార్థినిలను పరామర్శించిన జడ్పి ఛైర్మన్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన సంక్షేమ కళాశాల విద్యార్థులను జెడ్పి చైర్మెన్‌ విఠల్‌ రావు సోమవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం, ఆరోగ్యం గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ను పిల్లలకు కలిగిన ఇబ్బందుల గురించి అడిగారు. ఇక నుండి విద్యార్థులకు భోజన విషయంలో జాగ్రత్తలు వహించాలని పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పై ఉందని ప్రిన్సిపాల్‌కు తెలిపారు. విద్యార్ధినుల ఆరోగ్యం ...

Read More »

మహిళా చట్టాలపై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలపై హింసకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మహిళ హింస నిరోధక దినోత్సవం సందర్భంగా స్థానిక కొత్త అంబేద్కర్‌ భవన్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు, ...

Read More »

వసతి గహాల్లో నాణ్యమైన భోజనం అందించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతి గహాల్లో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు రెగ్యులర్‌గా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు వసతి గ హ అధికారులను ఆదేశించారు. గిరిజన డిగ్రీ విద్యార్థుల వసతి గహంలో శనివారం విద్యార్థినులు అస్వస్థతకు గురైన సందర్భాన్ని పురస్కరించుకొని సంబంధిత అధికారులతో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘటన ఎందుకు జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరోజు రాత్రి విద్యార్థినిలకు అందించిన ఆహారంపై వివరాలు అడిగారు. వసతి గహానికి ...

Read More »

మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాదు నగరంలోని విశ్వశాంతి జూనియర్‌ కళాశాలలో అంతర్జాతీయ ”మహిళా హింస నిరోధక దినోత్సవం” నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ జాతీయ సమన్వయకర్త తిరునగరి శ్రీహరి ముఖ్య అతిథిగా, అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం జిల్లా కార్యదర్శి సబ్బని లత ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులనుద్దేశించి శ్రీహరి మాట్లాడుతూ ఏ, బి,సి,డి,సేప్టీ ఫర్‌ గర్ల్స్‌ సూత్రాన్ని వివరించి, మహిళల రక్షణకు సంబంధించిన ...

Read More »

దేశ సంస్కృతి, సంప్రదాయాల రక్షణకు ఆరెస్సెస్‌

నందిపేట్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత దేశపు ఆధ్యాత్మిక, నైతిక సంప్రదాయాలను పరిరక్షించడం ఆర్‌యస్‌యస్‌ సంస్థ ఆశయమని, హిందుత్వాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా భావిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ నందిపేట్‌ మండల ప్రచారక్‌ కుమార్‌, కార్యవహ శశికుమార్‌ అన్నారు. నందిపేట్‌ మండలంలోని సిర్పూర్‌ గ్రామంలో ఆరెస్సెస్‌ శిక్షణ తరగతులను వారం రోజులపాటు నిర్వహించారు. శిక్షణలో కర్రసాము, సూర్యనమస్కారాలు వంటి శారీరిక కార్యక్రమాలు నేర్పించారు. ఆదివారం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా హనుమాన్‌, మల్లన్న ఆలయాలను శుభ్రం చేశారు. ...

Read More »

కళాశాల విద్యార్థినిలను పరామర్శించిన పిడిఎస్‌యు

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీ, నాగారం విద్యార్థినులు సుమారు 80 మంది అనారోగ్యంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేరిన విషయమై పిడిఎస్‌యు నాయకులు కలిసి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు సీహెచ్‌. కల్పన మాట్లాడుతూ రెండు రోజులుగా 80 మంది విద్యార్థినులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని అన్నారు. ఆహారం కలుషితం కావడానికి, విద్యార్థులు అనారోగ్యానికి గురికావడానికి కారణాలను సమగ్ర విచారణ ద్వారా అధికారులు ...

Read More »

వాడివేడిగా మండలసభ

నందిపేట్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల ప్రజా పరిషత్తులో సోమవారం ఎంపీపీ వాకిలి సంతోష్‌ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. ప్రభుత్వ శాఖల మండల అధికారులు తమ తమ శాఖల నివేదికలు చదివి వినిపించారు. వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ప్రశ్నలతో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ భూముల కబ్జాలకు గురి కావడంపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారని ఎంపిటిసి రాజు, ఎంఆర్‌ఓను వివరణ కోరారు. కోమటి పల్లి సర్పంచ్‌ నాగరాజు ...

Read More »

అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించాలి

నందిపేట్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగం ప్రకారం దళిత బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్య, గ్రామాల అన్ని మండలాల్లో పట్టణాల్లో మెరుగైన ఉచిత విద్య వైద్యానికి పూర్తి బీమా సౌకర్యం కల్పించాలని దళిత యూత్‌ శక్తి మండల అధ్యక్ష కన్వీనర్‌ మోహన్‌, జిల్లా కన్వీనర్‌ సుమన్‌లు అన్నారు. విశారదం మహారాజ్‌ ఆదేశాలమేరకు నందిపేట్‌ మండలం సోమవారం బస్టాండ్‌ ...

Read More »

గురుకుల కళాశాల ఘటనపై నివేదిక అందజేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా సంక్షేమ శాఖల పరిధిలోగల విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలలో గల మౌలిక సదుపాయాలు కల్పన ఆహార నీటి సౌకర్యంపై పరిశీలన చేసి అప్పటికప్పుడే అవసరమైనచర్యలు తీసుకొని రెండు రోజుల్లో నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి సందర్భంగా అదికారులనుద్దేశించి మాట్లాడారు. ఆయా సంక్షేమ శాఖలైన ఎస్‌సి, ఎస్టీ, బిసి, మైనారిటీ వసతిగహాలు గురుకుల పాఠశాలలు, కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో వసతులు, సౌకర్యాలపై ...

Read More »

సేవ్‌ ఆర్‌టిసి

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌టిసి సమ్మెలో భాగంగా నిజామాబాద్‌ నగరంలో జేఏసీ ఆద్వర్యంలో సోమవారం సేవ్‌ ఆర్టీసి ర్యాలి నిర్వహించారు. నగరంలోని ధర్నా చౌక్‌ నుండి ఆర్టీసి డిపో వరకు ర్యాలీ కొనసాగింది. డిపొ వద్ద ఆర్టీసిని రక్షించాలంటూ కార్మికులు నినాదాలిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఏసిపి శ్రీనివాసరావు ఆద్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. అనంతరం ధర్న చౌక్‌ వద్ద ఆర్టీసి కార్మికులు రిలేదీక్షలు కొనసాగించారు.

Read More »

డిసెంబర్‌ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 26వ తేదీన కలెక్టర్‌ గ్రౌండ్‌లో దివ్యాంగుల ఆటల పోటీలు నిర్వహిస్తున్నందున దివ్యాంగులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్‌ 3 తేదీన రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్రీడా పోటీలలో దివ్యాంగులందరూ పాల్గొనే విధంగా మెప్మా, డిఆర్‌డిఏ, విద్య శాఖ, స్వచ్ఛంద ...

Read More »