బాన్సువాడ, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ 70వ ఆమోదం దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలోని మహాత్మా గాంధీ, డా.బిఆర్ అంబేడ్కర్ల విగ్రహాలకు రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహ చార్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ ...
Read More »Daily Archives: November 26, 2019
ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
నిజాంసాగర్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యూ ఎజ్ ఫౌండేషన్ వారి సహకారంతో కళాశాల ప్రిన్సిపాల్ ఏర్పాటుచేసిన అమ్మానాన్నలతో దీవెనలు కార్యక్రమానికి శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు తమ తల్లిదండ్రులతో ఎలా మెలగాలో గురువులతో, తోటి సహచరులతో, ...
Read More »కార్మికుల అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం
ఆర్మూర్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ కార్మికులు ఆర్టిసి సంస్థ రక్షణ కోసం యాభై రెండు రోజులు సమ్మె చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి మొండిగా, మొరటుగా కార్మికుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. రాష్ట్రంలో సుమారు 30 మంది ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు ఆత్మహత్యలు, బలిదానాలు జరిగినా కేసీఆర్ మనసు కరగలేదని, కేసీఆర్ తన స్వార్థం కోసంఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికి కుట్ర, కుతంత్రాలు చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర హైకోర్టు సమ్మె ...
Read More »ఎమ్మెల్యేను కలిసిన ఆర్మూర్ నేతలు
ఆర్మూర్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఆర్మూర్ తెరాస నేతలు కలిశారు. మండలంలో ప్రతిపాదించిన లిఫ్టులను తక్షణమే మంజూరు చేయించి పనులు ప్రారంభించాలని విన్నవించారు. లింక్ రోడ్లను వేయించాలని, మచ్చర్లకు బ్యాంకు ఎర్పాటు చేయించాలని కోరారు. ఈ విషయాలపై ఎమ్మెల్యే స్పందిస్తూ లిఫ్టులు మంజూరు పూర్తయినట్టేనని, ప్రకటించడమే మిగిలిందన్నారు. రోడ్లు కూడ త్వరలోనే పూర్తవుతాయని హామి ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆర్మూర్ ఎంపిపి పస్క నర్సయ్య, సర్పంచ్ గంజి ...
Read More »హక్కులతో పాటు విధులు, బాధ్యతలు గుర్తెరిగి నడుచుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యాంగ హక్కులతో పాటు విధులు బాధ్యతలు తెలుసుకొని ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో ప్రియాంబుల్ చదివి ప్రతిజ్ఞ చెప్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాతగా ఆయన సేవల్ని ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని ఈ వేడుకలు 2020 అంబేద్కర్ జయంతి ...
Read More »ఫాస్ట్ ట్యాగ్ అమలు వల్ల ఇబ్బందులు రాకుండా చూడండి
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ అమలు వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్లో ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టోల్ ప్లాజా వద్ద నగదు చెల్లింపు వాహనదారులకు ఒకే లేన్ కేటాయించడం ద్వారా రోజుకు 14 వేల వాహనాలు వెళ్లే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ జామ్ ...
Read More »దివ్యాంగులైనప్పటికి సజనాత్మకతకు కొదవలేదు
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులు అయినప్పటికీ వారిలో సజనాత్మకతకు, తెలివితేటలకు కొదవలేదని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి కోసం స్థానిక కలెక్టరేట్ క్రీడామైదానంలో ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులైన పిల్లలతో పరిచయాల అనంతరం కలెక్టర్ లాంఛనంగా పోటీలను ప్రారంభించారు. శారీరకంగా మానసికంగా దివ్యాంగులు అయినప్పటికీ ఇతరుల లాగే వారు కూడా కొన్ని రంగాలలో సజనాత్మకత కలిగి ఉన్నారని, కొన్ని కొన్ని విషయాల్లో వేరే వారి ...
Read More »