Breaking News

Daily Archives: November 27, 2019

మహిళలపై దాడి

రెంజల్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామానికి చెందిన ఇరువురు రైతులు భూమి తమదంటే తమదంటూ తగాదకు దిగారు. జలీల్‌ ఖాన్‌ అనే రైతు వరి పంట కోస్తుండగా తమ సొంత భూమిలో పంటను ఎందుకు కోస్తున్నావని నిలదీసిన ఇందూరు లక్ష్మీ, కవితలపై జలీల్‌ ఖాన్‌ దాడి చేశాడు. దీంతో మహిళలు తహసీల్దార్‌ను ఆశ్రయించారు. తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ పోలీసులకు ఫోన్‌ చేయగా ఫోన్‌ అందుబాటులో లేదని రావడంతో డిఎస్పీకి పిర్యాదు చేశారు. డిఎస్పి ఎస్సైని, ...

Read More »

బ్యాంకర్లు సానుకూల దక్పథంతో వ్యవహరించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుణాల మంజూరులో బ్యాంకర్లు సానుకూలంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు సంబంధిత బ్యాంకు యాజమాన్యాల సూచనలు ఉన్నప్పటికీ బ్యాంకు బ్రాంచ్‌ స్థాయిలో కొందరు అధికారులు రుణాల మంజూరులో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు రుణాలు మంజూరు చేసి గ్రౌండింగ్‌ జరిగేలా నిర్ణీత సమయంలో ...

Read More »

ట్రాక్టర్‌ తగిలి వ్యక్తి మృతి

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామం చెందిన ప్రసాద్‌ (34) ట్రాక్టర్‌ కిందపడి మతి చెందినట్లు రామారెడ్డి ఏఎస్‌ఐ అశోక్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే మంగళవారం రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో బెరిగి గంగా ప్రసాద్‌ తన వ్యవసాయ పొలం నుండి కొనుగోలు కేంద్రానికి రాత్రి పూట ట్రాక్టర్‌మీద తీసుకువస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ తగిలి అక్కడికక్కడే మతి చెందాడు. ప్రసాద్‌ భార్య రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ట్రాక్టరు ...

Read More »

పోలీసుల కార్డాన్‌ సర్చ్‌

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బ్రహ్మాజివాడి గ్రామం తాడ్వాయి మండలంలో కార్డాన్‌ అండ్‌ సెర్చ్‌ కార్యక్రమం సందర్భంగా జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారిణి శ్వేత అద్వర్యంలో శశాంక్‌ రెడ్డి యెల్లారెడ్డి డీస్పీ పర్యవేక్షణలో, జి. వెంకట్‌ సదాశివనగర్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ అఫ్‌ పోలీస్‌, రాజశేఖర్‌, స్థానిక సబ్‌ ఇన్స్పెక్టర్‌ అఫ్‌ పోలీస్‌ అయిన యం.క్రిష్ణమూర్తితో పాటు సదాశివనగర్‌ ఎస్‌ఐ నరేష్‌, లింగంపేట ఎస్‌ఐ సుఖేందర్‌ రెడ్డి, యెల్లారెడ్డి ఎస్‌ఐ శ్వేత, నాగిరెడ్డిపేట ఎస్‌ఐ మోహన్‌, యెల్లారెడ్డి ఎస్‌ఐ-2 కుమార్‌ ...

Read More »

పాస్‌పుస్తకాలు అందించండి సారూ…

రెంజల్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2015 సంవత్సరంలో ప్రభుత్వం ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూమికి సంబంధించిన పట్టా పాసుపుస్తకాలు అందజేయాలని కోరుతూ లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్‌ అసదుల్లా ఖాన్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం లంబాడీల ఐక్యవేదిక జిల్లా కో ఆర్డినేటర్‌ సరిదాస్‌ నాయక్‌ మాట్లాడారు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన లంబాడీలకు ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా రెంజల్‌ మండలం తాడ్‌ బిలోలి గ్రామ శివారులో ...

Read More »

విద్యార్థులకు వాటర్‌ బాటిల్స్‌ వితరణ

ఆర్మూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం జిల్లా పరిషత్‌ రాం మందిర్‌ పాఠశాల విద్యార్థులకు నివేదిత ఫౌండేషన్‌ చైర్మన్‌ మైలారం బాలు వాటర్‌ బాటిల్స్‌ను అందజేశారు. కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న వాటర్‌ బెల్‌ పీరియడ్‌ను బుధవారం ముఖ్య అతిధిగా విచ్చేసినా ఆర్మూర్‌ తహసీల్దార్‌ సంజయ్‌ రావు ప్రారంభించారు .ప్రతి పాఠశాలలో వాటర్‌ బెల్‌ పీరియడ్‌ను అమలు చేస్తే విద్యార్థులు ఆరోగ్యాంగా ఉంటారని అన్నారు. నివేదిత ప్రిన్సిపాల్‌ గోదావరి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రోజుకు ఆరు లీటర్ల వాటర్‌ ...

Read More »

పశువులకు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు

ఆర్మూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో మూడు సంవత్సరాలకు పైబడి ఉన్న అన్ని ఆడ పశువులకు (గేదె జాతి మరియు గో జాతి పశువులలో) విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు మండలంలో ఇస్సాపల్లి, మగ్గిడి, అందాపూర్‌, సుర్బిర్యాల్‌, చేపూర్‌, పెర్కిట్‌, కోటార్మూర్‌, మామిడిపల్లి, గోవింద్‌ పేట్‌, అంకాపూర్‌, ఫతేపూర్‌ గ్రామాలలో పూర్తిచేయడం జరిగిందని మండల పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌ తెలిపారు. మంగళ, బుధ వారాల్లో ఫతేపూర్‌ గ్రామంలో ఉన్న ...

Read More »

30న బాన్సువాడకు కెటిఆర్‌ రాక

బాన్సువాడ, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశం బుధవారం బాన్సువాడ పట్టణంలోని తెరాస పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగింది. దేశాయిపేట పిఏసిఎస్‌ అధ్యక్షుడు, తెరాస పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ..ఈ నెల 30న రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి కెటి రామారావు బాన్సువాడ పట్టణానికి విచ్చేసి పలు అభివద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలిపారు. ...

Read More »

సభాస్థలిని పరిశీలించిన పోచారం భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి కెటి రామారావు బాన్సువాడ పట్టణ పర్యటన నేపథ్యంలో బహీరంగ సభ పార్కింగ్‌ కోసం నూతన మార్కెట్‌ స్థలాన్ని పోలీసు అధికారులు, స్థానిక నాయకులతో కలిసి తెరాస పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు.

Read More »

పాఠశాలలో ప్రారంభమైన ఎన్నికల సందడి

నందిపేట్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్‌ బడులకు దీటుగా దీటుగా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయబోతుంది. ఇదివరకే జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మరుగుదొడ్ల, తాగు నీటి సౌకర్యలకు నిధులు కేటాయిస్తున్నారు. జడ్పీ నిధులతో కూడా సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చుకోవడానికి తల్లిదండ్రుల ద్వార స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు కొరకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ప్రతి రెండు సంవత్సరాల కాల వ్యవధిలో జరగవలసిన ...

Read More »

నాయకుల గృహ నిర్బంధం

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ముట్టడిని విఫలం చేయడానికి నిజామాబాద్‌లో పోలీసులు అరెస్టులకు శ్రీకారం చుట్టారు. మంగళవారం నిజామాబాదులో అర్ధరాత్రి నుండి సిపిఎం నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి గహ నిర్భందం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్‌లను పోలీసులు అర్ధరాత్రి నుండి గ హనిర్బంధం చేశారు. సిపిఎం నేత గోవర్ధన్‌ను ఆరో ...

Read More »

మేలుకొలుపు సభ జయప్రదం చేయండి

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 28న మహాత్మ జ్యోతిరావు పూలే వర్దంతి సందర్భంగా నిజామాబాదు జిల్లా బాల్కొండలో బిసి విద్యార్థుల మేలుకొలుపు సభ నిర్వహిస్తున్నట్టు జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్‌ తెలిపారు. బిసి విద్యార్థి సంఘం ఆద్వర్యంలో జరిగే సభకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిధిగా హాజరవుతారని చెప్పారు. బీసీ కుల సభ్యులు, బీసీ బంధువులు సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

Read More »

బిజెపి మండల అధ్యక్షునిగా హనుమాండ్లు యాదవ్‌

బీర్కూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అర్సపల్లి సాయిరెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జి నాయుడు ప్రకాష్‌, చిదిర సాయిలు ఆధ్వర్యంలో నస్రుల్లాబాద్‌ మండల అధ్యక్షుడు చందూరి హనుమాండ్లు యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హనుమాండ్లు యాదవ్‌ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని మండలంలో పార్టీ బలోపేతానికి అన్ని విధాల కషి చేస్తానని, బాధ్యతను అప్పచెప్పిన పార్టీకి రుణపడి ఉంటానని ...

Read More »