Breaking News

Daily Archives: November 28, 2019

మొక్కల పెంపకాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం శేర్‌శంకర్‌ తాండాలో జిల్లా ఉద్యానవన శాఖ వారి సహాయంతో 95 శాతం సబ్సిడీతో గ్రామస్తుడు ధరావత్‌ షక్రియా చామంతి, చాందిని వెరయిటీ పూల మొక్కల పెంపకం పాలీ హౌజ్‌ను కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సందర్శించారు. ప్రభుత్వం అందజేసిన సబ్సిడీతో చక్కగా నిర్వహింపబడుతున్న పాలిహౌజ్‌ ఏర్పాట్లను, పూల మొక్కల నిర్వహణను అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రేణుకా చౌహాన్‌, జడ్పిటిసి సభ్యులు కొండ హన్మాండ్లు, మండల ఉద్యానవన అధికారులు రాజుగౌడ్‌, లోకేశ్‌, ...

Read More »

వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రబ్యాంక్‌ 97వ సంస్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రబ్యాంక్‌ కామారెడ్డి బ్రాంచ్‌ వారు కామారెడ్డి శివారులోని ఓల్డ్‌ఏజ్‌ హోమ్‌ లో పండ్లు పంపిణీ చేశారు. అలాగే అక్కడ కొత్తగా నిర్మించబోయే మూత్రశాలలు, స్నానపు గదుల కోసం 11 వేల రూపాయలు బ్యాంక్‌ సిబ్బంది విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్‌ మేనేజర్‌ వాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకోవాలని ఆర్టీసీ మేనేజర్‌ ఆంజనేయులుకు ఏఐవైఎఫ్‌ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. గురువారం కామారెడ్డి జిల్లాలో ఏఐవైఎఫ్‌ జిల్లా కో కన్వీనర్‌ దువ్వాలనరేశ్‌ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను వీధులలోకి తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల మూడు నెలల జీతం ఇవ్వాలని, అలాగే ఆర్టీసీ కార్మికులు తాము ఉంటున్న అద్దె కిరాయి కట్టలేక కార్మికులు ఆందోళనకు చెందుతున్నారన్నారు. వారి పిల్లల స్కూల్‌ ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారన్నారు. తాత్కాలిక డ్రైవర్లను నియమించడం ...

Read More »

తహసీల్దార్‌కు వినతి

రెంజల్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఫిబ్రవరి15న ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో లంబాడీల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు రాథోడ్‌ సర్దార్‌ చరణ్‌ సింగ్‌, రెంజల్‌ మండల అధ్యక్షుడు రామారావు, లక్ష్మణ్‌, గోపీ, రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సాటాపూర్‌లో ఉచిత రక్తపరీక్షలు

రెంజల్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో గురువారం వర్డ్‌, స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్షల కార్యక్రమాన్ని సర్పంచ్‌ వికార్‌ పాషా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్డ్‌, స్నేహ సొసైటీ వారు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించడం అభినదనీయమని అన్నారు. గ్రామానికి చెందిన సుమారు మూడు వందల మందికి రక్త పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వర్డ్‌ కో ఆర్డినెటర్స్‌ సమత, రహిమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కలెక్టర్‌ను కలిసిన పశుసంవర్ధక శాఖ ఎం.డి.

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశువైద్య, సంబంధిత శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మరియు సంచాలకులు డాక్టర్‌ వి. లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను ఛాంబర్లో కలిశారు. ఆయన వెంట పశుసంవర్ధక శాఖ ఇన్చార్జ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ బాలిక్‌ అహమ్మద్‌ ఉన్నారు.

Read More »

జాతీయ ఫెలోషిప్‌కు జనార్ధన్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంబేద్కర్‌ జాతీయ ఫెలోషిప్‌ అవార్డుకు ఎంపికైన నిజామాబాదు జిల్లాకు చెందిన సిరివెన్నెల గ్రీన్‌ సొసైటీ వ్యవస్థాపకుడు రావుట్ల జనార్థన్‌ ను రూరల్‌ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్దన్‌ అభినందించారు. గురువారం దర్పల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యేను జనార్దన్‌ కలిశారు. ఈ సందర్భంగా జనార్దన్‌ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కషి అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. వధాగా పారేసిన కొబ్బరి బోండంలో నాటిన బాదం మొక్కను జనార్థన్‌ ఎమ్మెల్యేకు అందజేశారు.

Read More »

పేదలకు వరం.. సీఎం సహాయనిధి

నందిపేట్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేదలకు సీఎం సహాయనిధి ఒక వరంలా పనిచేస్తున్నదని ఆర్మూర్‌ టిఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. నందిపేట్‌ మండలంలోని వన్నెల్‌ కే గ్రామంలో గురువారం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎనిమిది మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. గురువారం లబ్ధిదారులకు స్థానిక సర్పంచులు, సీనియర్‌ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేద, మధ్యతరగతి ప్రజలకు వరంలా పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్యే ...

Read More »

హెల్మెట్‌ ధరించకుంటే మరణశాసనమే

నందిపేట్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్మెట్‌ వాడకపోవడంతో 11 నెలల్లో 7 మంది ద్విచక్రవాహనదారులు మత్యువాత పడ్డారు. ద్విచక్రవాహనదారుడికి హెల్మెట్‌ అనేది ఎంతో అవసర శిరస్త్రాణం ధరించకుండా బైక్‌ నడిపితే.. అది ప్రాణాంతకమే.. నందిపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 7 మంది ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ లేకపోవడంతో ప్రమాదాల్లో మత్యువాత పడ్డారు. 11 నెలల్లో సుమారు 2 వేల వరకు ట్రాఫిక్‌ ఉల్లంఘనలు జరిగితే, ఇందులో హెల్మెట్‌లేని వాహనదారులపై విధించిన కేసుల సంఖ్య 500 పైనే. ఈ ఏడాది నవంబర్‌ ...

Read More »

కెవైసి పూర్తిచేయడానికి గడువు పెంచాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రావిడెంట్‌ ఫండ్‌ ఫారం నెంబర్‌ 9 లో బీడీ కార్మికుల ఇంటి పేరు, భర్త పేరు, పుట్టిన తేది తప్పుగా నమోదు చేశారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ లో తప్పుగా నమోదైన పేర్లను పుట్టిన తేదీలను నవంబర్‌ 30వ తేదీ వరకు సవరణ చేయించుకోవాలని కేవైసిని పూర్తిచేయాలని ప్రావిడెంట్‌ ఫండ్‌ అధికారులు గడువు విధించారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ అధికారులు విధించిన గడువును కేంద్ర కార్మిక మంత్రితో మాట్లాడి ఒక సంవత్సరం వరకు పెంచాలని యూనియన్‌ ...

Read More »

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా 80 వేల ఎకరాలకు సాగునీరు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని నిజామాబాద్‌ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. గురువారం ధర్పల్లి మండలం హొన్నాజి పేట గ్రామంలో జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.1.61 కోట్లతో నిర్మాణం చేసుకున్న చిన్న మత్తడిని ప్రారంభించారు. గ్రామంలో గ్రామ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభించారు. కొనసాగుతున్న మెడికల్‌ క్యాంపును పరిశీలించి డాక్టర్లతో వివరాలు అడిగి ...

Read More »