కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత సంవత్సరం 2018 – 19, జిల్లాలో 100 శాతం హాజరు అయిన 14 మంది విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ డా. ఎన్. సత్యనారాయణ 14 మంది విద్యార్థులకు సైకిల్లను ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాన్సువాడ నందు బహుకరించడం జరిగింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 70వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగం ...
Read More »Daily Archives: November 29, 2019
మహిళలను గౌరవించడం ఇంటినుంచే ప్రారంభం కావాలి
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం హైదరాబాదులో ప్రియాంక రెడ్డిపై జరిగిన అత్యాచారం హత్యలను ఖండిస్తూ బాధ్యులైన మానవ మగాలను కఠినంగా శిక్షించాలని ప్రియాంక రెడ్డికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ ప్రియాంక రెడ్డిపై, వరంగల్‌లో మానస పై జరిగిన దారుణాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యులైన మానవ మగాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వెంటనే ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని ...
Read More »యువకుని రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భద్రాచలం జిల్లాకు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారక్ నరేశ్ మాతృమూర్తి శ్యాంసుందర్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా అత్యవసరంగా ఏ,బి, పాజిటివ్ రక్తం అవసరం కాగా వారు ఏబీవీపీ రక్తదాతల సమూహాన్ని సంప్రదించారు. ఏబీవీపీ పూర్వ కార్యకర్త శ్రీకాంత్ రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న వారిని రక్త దాతల సముహం తరుపున అదుకోవడం చూస్తుంటే తమకు చాలా ఆనందంగా ఉందని రోగి బంధువులు కొనియాడారు.
Read More »భవన నిర్మాణ కార్మికుల ఉపాధి కాపాడాలి
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఐక్య బిల్డింగ్ వర్కర్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐసీటీయు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిర్మాణ రంగ కార్మికులు స్థానికులకు ఉపాధి కాపాడాలని జిల్లా కలెక్టరేట్లో ఉన్న స్పెషల్ ఆఫీసర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ప్రభాకర్ ఏఐసిటియు జిల్లా బాధ్యులు రాజలింగం, సంఘం బాధ్యులు జబ్బర్ నాయక్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ...
Read More »అక్షరాలపై వ్యాపారం కోసమే ప్రభుత్వ పాఠశాలల మూసివేత
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు అంబెడ్కర్ విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయాల్సిన ప్రభుత్వం అక్షరాలపై వ్యాపారం చేయడం కోసమే ప్రభుత్వ బడులను మూసి వేసే కుట్ర పన్నుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్, కార్పొరేట్ విద్యా ...
Read More »మునిసిపల్ వాహనాలు, యంత్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా సుమారు 62 లక్షల 45 వేల రూపాయలతో కొనుగోలు చేసిన వాహనాలను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో సుమారు 62 లక్షల 45 వేల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను, నీటి ట్యాంకర్లను, జెట్టింగ్ యంత్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పనులకు గాను కొనుగోలు ...
Read More »డిసెంబర్ 1న ‘ముచ్చట’ పుస్తక పరిచయ సభ
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగతి సాహిత్య విభాగం నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనపురం దేవేందర్ రచించిన ముచ్చట కావ్యపరిచయ సభ డిసెంబరు 1న ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ తిరుమల శ్రీనివాస్ ఆర్య తెలిపారు. సభాధ్యక్షులుగా తెలంగాణ జాగతి జిల్లా కన్వీనర్ అవంతి కుమార్, ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, గౌరవ అతిథులుగా తెలంగాణ రచయితల సంఘం, రాష్ట్ర ...
Read More »వీధి కుక్కల జనాభా పెరగకుండా జాగ్రత్తలు
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వీధికుక్కల జనాభా పెరగకుండా చూడడంతో పాటు అవి కరవడం వల్ల ప్రాణాలకు ముప్పు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం తన చాంబర్లో సంబంధిత అధికారులతో వీధి కుక్కల బెడదను తగ్గించే విషయమై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమలులో ఉన్న ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా వీటి సంఖ్యను పెరగకుండా చూడడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. యాంటీ బర్త్ కంట్రోల్, యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ...
Read More »విద్యార్థుల చదువుపట్ల శ్రద్ద కనబరచాలి
నిజాంసాగర్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ ఆనంద్ రెడ్డి అధ్యాపకులు నరేష్, సురేష్, రమా, రామకష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, రంజిత్ కుమార్, రాజారాం, ఆంజనేయులు, జాహెద్ స్వరూప, విజయలక్ష్మి, మురళి పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తల్లిదండ్రులనుద్దేశించి మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్నందున పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇది తల్లిదండ్రుల యొక్క ముఖ్య బాధ్యత అని చెప్పారు. తర్వాత ...
Read More »పిట్లంలో దీక్షా దివస్
నిజాంసాగర్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీక్షా దివస్ సందర్భంగా కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో తెరాస పార్టీ పట్టణ అద్ధ్యక్షులు బుగడల నవీన్, సర్పంచ్ జొన్న విజయ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More »విద్యార్థుల సంక్షేమానికి పెద్ద పీట
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పలు సదుపాయాలు దేశంలో మన రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున జరుగుతున్నాయని నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ మండలం బోర్గాం (పి) గ్రామంలో కోటి 30 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతిగహాన్ని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, ఎమ్మెల్సీ వి.జీ. గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ ...
Read More »మినీ ట్యాంక్‌బండ్ పనులు పరిశీలించిన స్పీకర్
బాన్సువాడ, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు వద్ద చేపడుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులను శుక్రవారం శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. ఉదయమే నడక సాగిస్తూ చెరువు కట్టపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్కడికి వచ్చిన వాకర్స్‌తో మాట్లాడారు.
Read More »సిఎంకు ధన్యవాదాలు
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమ్మె చేసి తిరిగి విధుల్లోకి చేరుతున్న కార్మికులను భేషరతుగా విధుల్లోకి చేర్చుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు నరాల సుధాకర్ తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తున్నది దాదాపు తొంభై శాతం బహుజనులేనని, అదే విధంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేది తొంభై అయిదు శాతం బహుజన ప్రజలేనన్నారు. ఏ విధంగా చూసుకున్నా ఆర్టీసీతో బిసి సంఘాలకు ఒక విడదీయని సంబంధం అవినాభావ బంధం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను భేషరతుగా ...
Read More »యువ భవిష్యత్తుకు మార్గదర్శనం చేయాలి
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫెయిత్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని కందుకూరులో శుక్రవారం జరిగిన యువ సాధికార సదస్సులో జిల్లా కేంద్రానికి చెందిన విశ్వ తేజస్ సంస్థ వ్యవస్థాపకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి ప్రసంగించి యువతకు దిశానిర్దేశం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీహరిని ప్రత్యేకంగా అభినందించారు. యువత భవిష్యత్‌కి సంబంధించి సరైన మార్గదర్శనం చేస్తూ, వారిలో దేశభక్తి పెంపొందింపజేసేందుకు కషి ...
Read More »దుమ్ములేపుతున్న రోడ్డు
నందిపేట్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మెయిన్ రోడ్డు దుమ్ములేపుతుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రతి వర్షాకాలంలో అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని మెయిన్‌రోడ్డు గుంతలమయంగా మారడం, పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి ఆర్అండ్బి అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయడంతోనే సరిపెడుతున్నారు. ఈ సంవత్సరం పూర్తిగా చెడిపోయిన రోడ్డు వలన వాహనాలు బోల్తా పడడంతో స్పందించిన అధికారులు తాత్కాలిక మరమ్మతుల కొరకు కంకర డస్టు, మొరం వేసి గుంతలు పూడ్చారు. వర్షాకాలం వలన ...
Read More »దీక్షాదివస్ సందర్భంగా శాలువాల పంపిణీ
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కెసిఆర్ దీక్షా దివస్ పురస్కరించుకొని శుక్రవారం 24వ డివిజన్ గాజుల్‌పేట్‌లో వృద్దులకు శాలువాలు పంపిణీ చేసినట్టు మాజీ కార్పొరేటర్ రంగు అపర్ణ సీతారాం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ దీక్షబూని 10 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. వారి వెంట పలువురు తెరాస కార్యకర్తలు ఉన్నారు.
Read More »