Breaking News

విద్యార్థుల సంక్షేమానికి పెద్ద పీట

నిజామాబాద్‌, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పలు సదుపాయాలు దేశంలో మన రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున జరుగుతున్నాయని నిజామాబాద్‌ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ మండలం బోర్గాం (పి) గ్రామంలో కోటి 30 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతిగహాన్ని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, ఎమ్మెల్సీ వి.జీ. గౌడ్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద మనసుతో పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారన్నారు. పెద్ద ఎత్తున వసతిగహాల ఏర్పాటుతో పాటు వారికి ఇతర సదుపాయాలు ప్రతిరోజూ ఉపయోగించే వస్తువులు, సన్న బియ్యం, దుస్తులు, తదితర సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారన్నారు. ఇలాంటి సదుపాయాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని తెలిపారు.

ఈ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. వసతి గహ కాంపౌండ్‌ వాల్‌కు ఏడు లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆయన స్పందిస్తూ ఆడపిల్లల పట్ల మగాలుగా వ్యవహరిస్తున్నారని ఇందుకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరముందని, వారికి కూడా అక్కాచెల్లెళ్లు ఉంటారు కదా అన్నారు.

అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని వారికి మిగతా వారంతా సపోర్ట్‌గా, ధైర్యంగా ఉండేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి పెద్దమనసుతో ఆర్టీసీ ఉద్యోగుల పట్ల కూడా మంచిగా బతకాలని విధుల్లో చేరడానికి అవకాశం కల్పించాలన్నారు. ఈ తేదీన ముఖ్యమంత్రి తెలంగాణ కొరకు దీక్షాదివస్‌ చేపట్టిన సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు అందించాలని భగవంతున్ని కోరుతున్నానన్నారు.

కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు అభివద్ధి మరోవైపు సంక్షేమంపై ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వసతి గహ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న పౌష్టిక ఆహారం వల్ల విద్యార్థుల్లో రక్తహీనత తగ్గి మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా ముందుండాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతారని తెలిపారు.

గహాల్లో విద్యార్థులకు అందించే ఆహారంపై జాగ్రత్తగా ఉండాలని గత శనివారం నగరంలోని గిరిజన వసతి గహంలో జరిగిన సంఘటన పునరావతం కాకుండా అన్ని జాగ్రత్తలు అధికారులు వార్డెన్లు ముందుగానే తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు వెంటనే తగిన వైద్య సదుపాయం అందించడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదన్నారు. వసతి గహ విద్యార్థులు కళాశాలలకు వెళ్లడానికి అవసరమైన రవాణా సదుపాయం గురించి ఆలోచిస్తామన్నారు.

కాంపౌండ్‌ వాల్‌, సీసీ కెమెరాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఈమధ్య నిర్వహించుకున్న 30 రోజుల పల్లె ప్రగతి ప్రజా ప్రతినిధులు మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. నాటిన మొక్కలకు ట్రిగార్డుల ఏర్పాటు వల్ల గ్రామాల్లో పచ్చదనం కనిపిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు మాట్లాడుతూ సంక్షేమ వసతి గహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని జిల్లాలో 1400 మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారన్నారు.

శాసనమండలి సభ్యులు వి.జి.గౌడ్‌ మాట్లాడుతూ పేదలందరికీ అన్ని వసతులతో విద్యను అందించడానికి ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 700 పైగా వసతి గహాలు ప్రారంభించారన్నారు. ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థిపై లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు.

కార్యక్రమాల్లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సంధ్యారాణి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పనుల‌ పురోగతి బాగుంది

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందల్వాయి, గన్నారంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ...

Comment on the article