Breaking News

డిసెంబర్‌ 1న ‘ముచ్చట’ పుస్తక పరిచయ సభ

నిజామాబాద్‌, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి సాహిత్య విభాగం నిజామాబాద్‌ ఆధ్వర్యంలో ఘనపురం దేవేందర్‌ రచించిన ముచ్చట కావ్యపరిచయ సభ డిసెంబరు 1న ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక కేర్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్‌ తిరుమల శ్రీనివాస్‌ ఆర్య తెలిపారు.

సభాధ్యక్షులుగా తెలంగాణ జాగతి జిల్లా కన్వీనర్‌ అవంతి కుమార్‌, ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, గౌరవ అతిథులుగా తెలంగాణ రచయితల సంఘం, రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకరం, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తెలంగాణ విశ్వవిద్యాలయం గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి, జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, విచ్చేస్తారన్నారు. సాహిత్య ప్రియులు, కవులు, కవయిత్రులు, తెలంగాణ జాగతి సర్వ సభ్యులు అధిక సంఖ్యలో హాజరు కాగలరని శ్రీనివాస్‌ కోరారు.

Check Also

జిల్లాస్థాయి గణిత పోటీలలో రెంజల్‌ విద్యార్థులు

రెంజల్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 47వ జవహర్‌ లాల్‌ నెహ్రూ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *