నిజామాబాద్, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వీధికుక్కల జనాభా పెరగకుండా చూడడంతో పాటు అవి కరవడం వల్ల ప్రాణాలకు ముప్పు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం తన చాంబర్లో సంబంధిత అధికారులతో వీధి కుక్కల బెడదను తగ్గించే విషయమై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అమలులో ఉన్న ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా వీటి సంఖ్యను పెరగకుండా చూడడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. యాంటీ బర్త్ కంట్రోల్, యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ద్వారా పేట సంస్థ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వీటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఈ శస్త్ర చికిత్సలకు అవసరమైన డాక్టర్లను రిటైర్ అయిన వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఒక్కో డాక్టర్ నెలకు 50 ఆపరేషన్లు చేయడానికి వీలు ఉన్నందున కొద్ది రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి వీలవుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో, పీహెచ్సిల్లో కుక్క కాటుకు సంబంధించిన ఇంజెక్షన్లను నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు.
గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వీధి కుక్కల సంఖ్య ఏ మేరకు ఉందో సేకరించాలని అన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జాన్ సాంసన్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి బాలిక్ అహ్మద్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డిఎం అండ్ హెచ్వో సుదర్శనం, ఎంహెచ్ఓ సాజిద్, ఎం.ఇ ఆనంద్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.

Latest posts by Nizamabad News (see all)
- గిరిజనుల పథకాలపై అవగాహన కల్పించాలి - December 7, 2019
- జిల్లా స్థాయి గణిత పరీక్షకు 400 మంది ఎంపిక - December 7, 2019
- మహిళా చట్టాలు, రక్షణపై అవగాహన - December 7, 2019