Breaking News

మహిళలను గౌరవించడం ఇంటినుంచే ప్రారంభం కావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం హైదరాబాదులో ప్రియాంక రెడ్డిపై జరిగిన అత్యాచారం హత్యలను ఖండిస్తూ బాధ్యులైన మానవ మగాలను కఠినంగా శిక్షించాలని ప్రియాంక రెడ్డికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ ప్రియాంక రెడ్డిపై, వరంగల్లో మానస పై జరిగిన దారుణాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యులైన మానవ మగాలను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు వెంటనే ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలు పగలు కూడా స్వేచ్ఛగా వారి పనులు చేసుకోలేని పరిస్థితిలో, భయాందోళనలకు గురవుతున్నారన్నారు.

స్త్రీని దేవతలాగా పూజిస్తున్నామని చెప్పుకుంటున్న దేశంలో కనీసం తోటి మనిషిలాగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించడం ఇంటినుండే ప్రారంభం కావాలన్నారు. చిన్నారుల నుండి మహిళల వరకు భద్రత కరువైందన్నారు. ప్రభుత్వాలు, పోలీసులు మేమున్నామని భరోసా కల్పించాల్సిన తక్షణ అవసరం ఉందన్నారు.

ప్రమాదాలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మానవ విలువలు లేని విద్యా విధానమే నేరాలకు ప్రధాన కారణమన్నారు. సమాజంలోని మనుషులందరినీ గౌరవించాలని చెప్పే శాస్త్రీయ విద్య కావాలన్నారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు జిల్లా నాయకులు ప్రశాంత్‌, ప్రత్యూష, సంగీత, అశుర్‌, సాయి తేజ, రుచిత, సంధ్య, రాణి తదితరులు మరియు హాస్టల్‌ విద్యార్థినులు పాల్గొన్నారు.

Check Also

పనుల‌ పురోగతి బాగుంది

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందల్వాయి, గన్నారంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ...

Comment on the article