నిజామాబాద్, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమ్మె చేసి తిరిగి విధుల్లోకి చేరుతున్న కార్మికులను భేషరతుగా విధుల్లోకి చేర్చుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు నరాల సుధాకర్ తెలిపారు.
ఆర్టీసీలో పనిచేస్తున్నది దాదాపు తొంభై శాతం బహుజనులేనని, అదే విధంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేది తొంభై అయిదు శాతం బహుజన ప్రజలేనన్నారు. ఏ విధంగా చూసుకున్నా ఆర్టీసీతో బిసి సంఘాలకు ఒక విడదీయని సంబంధం అవినాభావ బంధం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను భేషరతుగా విధుల్లోకి ముఖ్యమంత్రి చేర్చుకోవడంతో బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తూ కార్మికులతో మిఠాయిలు పంచుకుని సంబరాలు చేయడం జరిగిందన్నారు.
అదే విధంగా సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తానని కెసిఆర్ హామీ ఇవ్వడం కూడా హర్షణీయమని, ఆర్టీసీ మనుగడ కొరకు కెసిఆర్ వంద కోట్లు ఇవ్వడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించడానికి కమిటీలను ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కారానికి కషి చేస్తానని ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి బిసి సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో నరాల సుధాకర్, పోల్కం గంగాకిషన్, దర్శనం దేవేందర్, చెరుకు లక్ష్మణ్ గౌడ్, పొదిల శోభ, శ్రీలత, బోడిగం గంగాధర్, సంజీవ్, చంద్రకాంత్, బాలన్న, అనిల్, గోపి, సత్యనారాయణ మరియు ఆర్టీసీ డ్రైవర్ ఇంద్రాగౌడ్ కండక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest posts by Nizamabad News (see all)
- గిరిజనుల పథకాలపై అవగాహన కల్పించాలి - December 7, 2019
- జిల్లా స్థాయి గణిత పరీక్షకు 400 మంది ఎంపిక - December 7, 2019
- మహిళా చట్టాలు, రక్షణపై అవగాహన - December 7, 2019