Breaking News

సమాచారహక్కు చట్టంపై అవగాహన

కామారెడ్డి, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సదాశివనగర్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల ఇంచార్జ్‌ ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా అఖిల భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌రావు హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టం 2005 ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అన్నారు.

గ్రామపంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పౌరుడు దరఖాస్తు చేసుకొని 30 రోజుల్లో సమాచారం తీసుకోవచ్చని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ప్రాణహాని ఉన్న సందర్భంలో కేవలం 48 గంటల్లో సమాచారం ఇవ్వాలని అన్నారు. దేశ భద్రత మరియు కోర్టు జడ్జిమెంట్‌ మరియు సి.బి.ఐ సిఐడి పోలీస్‌ స్టేషన్‌ ఆయుధాల సమాచారాన్ని సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా మినహాయించడం జరిగిందని అన్నారు.

సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రతి పౌరుడు దరఖాస్తు చేసుకొని తనిఖీ చేయవచ్చని అన్నారు. మొదటి గంట వరకు ఉచితంగా తనిఖీ చేసుకోవచ్చని, తర్వాత ప్రతి గంటకి 5 రూపాయల చొప్పున అధికారులకు రుసుము చెల్లించి తనికీ చేసుకోవచ్చని అన్నారు. గ్రామ పంచాయతీ అయితే తెల్ల రేషన్‌ కార్డు పెట్టి ఉచితంగా సమాచారం తీసుకోవచ్చన్నారు.

మండల స్థాయి అయితే 5 రూపాయల రుసుము చెల్లించాలని మరియు జిల్లా మరియు రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలో అయితే పది రూపాయలు రుసుము చెల్లించి సమాచారం తీసుకోవచ్చని అన్నారు. సమాచారం ఇవ్వని అధికారులకు సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్‌ సంబంధిత అధికారులకు కనిష్టంగా 250 రూపాయల నుండి గరిష్టంగా 25 వేల వరకు జరిమానాలు విధిస్తారని అన్నారు.

దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని అధికారులు కేవలం నాలుగు పేజీలు మాత్రమే ఉచితంగా ఇస్తారని తరువాత ప్రతి పేజీకి రెండు రూపాయల చొప్పున రుసుము చెల్లించి సమాచారం తీసుకోవాలని అన్నారు. సమాచారాన్ని సిడి మరియు డివిడి రూపంలో గాని తీసుకోవచ్చని అన్నారు.

కావున ప్రతి ఒక్కరూ ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని బయటకు తీయాలని ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌ కుమార్‌ మరియు ఉపాధ్యాయులు చిత్ర, నీరజ, లింగమయ్య, నరేష్‌, దశరథ్‌, రాజశేఖర్‌ రమణ, రమేష్‌, ప్రవీణ్‌ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *