Breaking News

టీచింగ్‌ లర్నింగ్‌ మెటీరియల్‌పై అవగాహన

ఆర్మూర్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని మండల పరిషత్‌ ప్రైమరీ పాఠశాలలో శనివారం టిఎల్‌ఎం టీచింగ్‌ లర్నింగ్‌ మెటీరియల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి తాను స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వస్తువులను విధ్యార్ధులచే చెప్పిస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీని ద్వారా విద్యార్థులు మరింత ఉన్నతమైన ఆలోచనలు కలిగి చదువుల్లో ముందు స్థాయిలో ఉండటానికి దోహదపడతాయని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, భాగ్యలక్ష్మి, సంధ్యారాణి, రాజేంద్రప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

వర్షాన్ని డబ్బుతో కొనలేం…

ఆర్మూర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలం పచ్చల‌ నడుకుడ గ్రామంలో ...

Comment on the article