Breaking News

అవినీతికి ఆస్కారం లేకుండా విధులు నిర్వహించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిర్యాదులకు తావు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా రెవెన్యూ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. ఈ మధ్యనే తహసీల్దార్లు డిప్యూటీ తాసిల్దారు జరిగిన బదిలీల నేపథ్యంలో శనివారం సాయంత్రం రెవెన్యూ అధికారులతో మూడు గంటల పాటు సుదీర్ఘంగా పలు విషయాలపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి సందర్భంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి అధికంగా వ్యాధులు వస్తున్నాయని అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సంతకాలు అయిన తర్వాత కూడా పాస్‌ పుస్తకాలు ఇంకా కొందరు రైతులకు ఇవ్వనట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయని ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జారీ అయిన అన్ని పాస్‌ పుస్తకాలు వెంటనే సంబంధిత రైతులకు అందచేయాలని ఆదేశించారు.

ఎవరి దగ్గర కూడా ఒక్క పాస్‌ పుస్తకం కూడా ఉండడానికి వీలు లేదని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. భూ ప్రక్షాళన సందర్భంగా ఇంకా పరిష్కరించడానికి అవకాశమున్నా అన్ని సమస్యలు పూర్తిచేయాలని కేవలం అనర్హత, కోర్టు కేసులను మినహాయించి మిగతా పెండింగ్‌ కేసులన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు.

రెవెన్యూ అధికారులు అంటే ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య వారధిగా పలు విధులు నిర్వహించే వారిని ఈ విషయాన్ని దష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని సమస్యలు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌యుపి సమస్యలన్నీ మిషన్‌ మోడ్‌లో పూర్తి చేయాలని తెలిపారు. తద్వారా ఫిర్యాదులు తగ్గుతాయని అదేవిధంగా గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలన్నీ ఆ స్థాయిలోనే పరిష్కరించాలన్నారు.

అటవీ భూములకు సంబంధించి సంయుక్త విచారణలో అవగాహనకు వచ్చి రికన్సిలేషన్‌ చేసుకొని సంతకాలు అయిన భూముల రికార్డులను వెంటనే నమోదు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అవసరాలకు, వ్యక్తిగత నిర్మాణాలకు ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పూర్తి చేయడానికి కషి చేయాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తులు మీ స్థాయిలో పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు.

ధ్రువపత్రాల జారీ మిషన్‌ మోడల్‌ నిర్వహించాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి గ్రామ, మండల స్థాయిలో వ్యవసాయ రెవెన్యూ అధికారులు సరైన అవగాహనతో ఉండాలని జిల్లాలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి సేకరిస్తున్నామని, పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు కూడా పంట పండించిన వారిలో ఉంటారని, కేవలం ఆ పంట మన జిల్లాలోనే పండించినట్లు ధ్రువపత్రాలు జారీ చేస్తే సరిపోతుందని, ఈ విషయంలో రైతులకు వేరే విధంగా ఇబ్బందులు కలిగించవద్దని ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. వేరే రాష్ట్రం ధాన్యం మన జిల్లాకు రాకుండా చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అధికారులు ఎట్టిపరిస్థితిలోనూ అవినీతికి ఆస్కారం లేకుండా ఏ స్థాయిలో కూడా ఫిర్యాదులకు అవకాశం లేకుండా విధులు నిర్వహించాలని ఈ విషయంలో ఫిర్యాదులు వస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్‌డివోలు వెంకటేశ్వర్లు, గోపి రామ్‌, శ్రీనివాసులు, తహసిల్దార్లు, డిప్యూటీ తహసిల్దార్లు, కలెక్టరేట్‌ సెక్షన్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *