Breaking News

హసన్‌పల్లి ఎస్‌యంసి చైర్మన్‌గా బోయని సాయిలు

నిజాంసాగర్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌ పల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ఎస్‌ఎంసి కమిటీ ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో చైర్మన్‌ బోయిని ఎర్ర సాయిలు ఎన్నిక కాగా వైస్‌ చైర్మన్‌గా బేగారి సావిత్రి ఎన్నికయ్యారని పాఠశాల ప్రధానోపాద్యాయులు భూమయ్య తెలిపారు.

ఎయంసి చైర్మన్‌ సాయిలు, వైస్‌ చైర్మన్‌ బెంగరి సావిత్రిలకు ఎన్నిక కావడంతో ప్రధానోపాద్యాయులు భూమయ్య, శ్రీధర్‌, టీచర్‌ సంధ్యరాణిలు కలిసి పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు క్యాస గుండయ్య, బోయని సాయిలు, బోయని హరిన్‌, చాకలి సాయిలు, హైదర్‌, తదితరులు ఉన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *