Breaking News

మహిళలను గౌరవించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ సంస్థ మహిళలను గౌరవించాలని ముద్రించిన కరపత్రాలను కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్య సాయి హై స్కూల్‌లో శనివారం జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో స్థానిక ఎస్‌ఐ ఆసిఫ్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సంస్థ జాతీయ సమన్వయకర్త శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడే పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల పాత్ర ఏమిటనే విషయాన్ని వివరించారు. వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ జిల్లా సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పనుల‌ పురోగతి బాగుంది

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందల్వాయి, గన్నారంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ...

Comment on the article