Breaking News

అవగాహనతోనే ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూలన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విస్తత అవగాహన ద్వారానే ఎయిడ్స్‌ వ్యాధిని వ్యాప్తి చెందకుండా కంట్రోల్‌ చేయవచ్చని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

1988లో యునైటెడ్‌ నేషన్స్‌ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్‌ దినాన్ని జరుపుకొని దానిని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారని తెలిపారు. అవగాహన లేనందున సరైన చికిత్సలు అందుబాటులో లేని పరిస్థితుల్లో గతంలో ఎయిడ్స్‌ వ్యాధి ఎక్కువగా ఉండేదని తెలిపారు. ఈ వ్యాధిపై వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో చాలావరకు తగ్గిందని తెలిపారు.

గత 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఎయిడ్స్‌ వ్యాధి కార్యక్రమాల వల్ల జిల్లాలో 5.25 శాతం నుండి 0.65 శాతానికి తగ్గిందని తెలిపారు. ఎయిడ్స్‌ వ్యాధిపై పలు అపోహలు వున్నాయని వాటిలో చాలావరకు నిజం కావని, నీడిల్స్‌ షేరింగ్‌ వల్ల ఇది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అవగాహన కార్యక్రమాల వలన వారిపై గల వివక్ష, అపోహలు తొలగిపోయి కుటుంబ సభ్యులు, సమాజం తోడ్పాటు అందిస్తుందని, ఆ వ్యాధిగ్రస్తులకు మానసిక ధైర్యాన్ని కలిగిస్తున్నారని తెలిపారు.

ఇది ఒక మంచి పరిణామమని ఆయన తెలిపారు. జిల్లాలో 4100 మంది వ్యాధిగ్రస్తులకు చికిత్సలు మందులు అందించడంతోపాటు పెన్షన్‌ ఇస్తున్నామని, ఇతర సదుపాయాలు కూడా అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో ఈ వ్యాధిని జీరో శాతానికి తగ్గించడం ద్వారా నిజామాబాద్‌ను ఎయిడ్స్‌ రహిత జిల్లాగా ప్రకటించడానికి మనమందరం కలిసికట్టుగా కషి చేద్దామని పిలుపునిచ్చారు.

ఇందుకు ప్రతి ఒక్కరు కూడా వారి వంతుగా అవగాహన కల్పించాలని కోరారు. ఎవరైనా దురదష్టవశాత్తు ఈ వ్యాధి బారిన పడినప్పటికీ అభివద్ధి చెందిన వైద్య చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చాయని, ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలుపుతూ ప్రభుత్వం ద్వారా అందిస్తున్న చికిత్సలను, మందులను, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అంతకుముందు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ జీవన్‌రావు, డాక్టర్‌ విశాల్‌, డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో తుకారం రాథోడ్‌, డాక్టర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, స్నేహ సొసైటీ సిద్దయ్య, వర్డ్‌, సమత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నర్సింగ్‌ విద్యార్థులు, డాక్టర్లు, సిబ్బంది, డాక్టర్‌ ప్రతిమారాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *