Breaking News

కెరీర్‌పై దృష్టి సారించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎయిడ్స్‌ వ్యాధి పట్ల ముందస్తు అవగాహన తప్పనిసరి అని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, భారత మానసిక సంస్థ జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ ఆకుల విశాల్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మిర్చికాంఫౌండ్‌లోని వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గహంలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి డాక్టర్‌ విశాల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలిసి తెలియని వయసులో చెడు తిరుగుళ్లకు దూరంగా ఉండి కెరీర్‌పై దష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. చెడు స్నేహాల ప్రోద్భలంతో క్షణికావేశాలకు లోనై ఎయిడ్స్‌ తెచ్చుకోవద్దని తద్వారా భవిష్యత్తును పాడుచేసుకోవద్దన్నారు.

మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశలో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ జిల్లా సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లు, వసతి గహ అధికారి మచ్చేందర్‌, సంస్థ ప్రతినిధులు శేఖర్‌, నరహరినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *