Breaking News

మహిళ ఉద్యోగులకు, విద్యార్థినిలకు, మహిళలకు కొన్ని ముఖ్యమైన విషయాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మీరు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు పబ్లిక్‌ తిరిగే దారిలోనే వెళ్ళండి ఒంటరిగా కొత్త దారిలో వెళ్ళకండి.

కాలేజ్‌ విద్యార్థులు రాత్రిపూట బర్త్‌ డే పార్టీలకు మరియు వివిధ పార్టీలకు మీ స్నేహితులు పిలిచినా వెళ్ళకండి. ఒకవేళ కచ్చితంగా వెళ్ళాలి అని వుంటే వెంట పేరెంట్స్‌ లో ఒకరిని తప్పకుండా తోడు తీసుకవెళ్ళండి.

మహిళలు ఒకవేళ ఏదైనా పని మీద వెళ్ళి రావడం ఆలస్యమై ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే కుటుంబసభ్యులు అందుబాటులో వుంటే వారిని రమ్మని చెప్పండి. ఎవరైనా వచ్చిన తరువాతే బయలుదేరండి.

మీరు వెహికిల్‌ పార్క్‌ చేసేటప్పుడు సీసీ కెమెరాలు ఉన్నదగ్గరే పార్క్‌ చెయ్యండి.

మీకు ఎవరిమీదనైనా సందేహం ప్రమాదకరం అనిపిస్తే వెంటనే 100 నెంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. వారు మీకు సహాయపడుతారు.

మహిళలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒంటిమీద నగలు ఎక్కువగా వేసుకోకండి.

మహిళలు ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు అసభ్యకరంగా ఉన్న బట్టలను వేసుకోకండి. ఫుల్‌ డ్రెస్‌ వేసుకోండి.

ముఖానికి కచ్చితంగా స్కార్ఫ్‌ ధరించండి.

మీరు దూరంగా కాని దగ్గరలో కాని షేర్‌ ఆటోలో ప్రయాణించేటప్పుడు ఆటోలో ప్రజలు వుంటేనే వెళ్ళండి, ఒంటరిగా షేర్‌ ఆటోలో వెళ్ళకండి.

మీరు ప్రయాణించేటప్పుడు మీ వెంట ఏదైనా స్ప్రే బాటిల్‌ తప్పక ఉంచుకోండి.

మీ వాహనానికి ఏదైనా సమస్య వస్తే బస్‌లో వెళ్ళండి, వెహికిల్‌ అక్కడే వదిలెయ్యండి.

మీరు ఎవరికోసమైనా ఆగాల్సి వస్తే పబ్లిక్‌ ఎక్కువగా వున్న ప్లేస్‌లోనే ఉండండి, ఒంటరిగా వుండకండి.

ముఖ్యంగా ప్రమాదంగా ఉంది అనిపిస్తే మీరు ఖచ్చితంగా 100 నెంబరుకు సమాచారాన్ని అందించండి, వారు మీకు సేఫ్‌ జోన్‌లో తీసుకవెళ్తారు.

The following two tabs change content below.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *