Breaking News

స్ఫూర్తిదాయకం ఘనపురం దేవేందర్‌ కవిత్వం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనిషిలో మంచి మార్పు తెస్తుందని, కవిత్వం చదవడం, రాయడం గొప్ప అదష్టం అని ఘనపురం దేవేందర్‌ కవిత్వం నిత్య చైతన్యమని, ప్రబోధాత్మకంగా ఉంటుందని, స్పూర్తి దాయకమని, నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు అన్నారు.

ఆదివారం సాయంత్రం తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఘనపురం దేవేందర్‌ రచించిన ముచ్చట కావ్యపరిచయం సభకు జడ్పి ఛైర్మన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ భాష తెలంగాణ సంస్క తి, తెలంగాణ దిక్కారం, తెలంగాణ మమకారం ముచ్చట పుస్తకంలో మస్తుగా ఉన్నాయని ఆయన అభినందించారు.

ఉద్యమకాలంలో ఉద్యమమే ప్రధానాంశంగా కవిత్వం రచించిన దేవేందర్‌ తెలంగాణ ప్రగతి ఆశయంగా ఇప్పుడు కవిత్వం రాస్తున్నారని తెలియజెప్పారు. సాహిత్యరంగంలో నిజామాబాద్‌ జిల్లా చిరునామాగా ఘనపురం దేవేందర్‌ సాహిత్య సేవ చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ జాగతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్‌ ఆచారి మాట్లాడుతూ హదయాలకు హత్తుకునే విధంగా పల్లె గురించి, నాన్న ప్రేమ గురించి, ఇలా నలభై నాలుగు అంశాలపై రాసిన కవితలు వేటికవే వైవిధ్యంగా ఉన్నాయని వివరించారు.

కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ నాళేశ్వరం శంకర్‌ మాట్లాడుతూ ఇందూరు జిల్లా సాహిత్య వారసత్వాన్ని దేవేందర్‌ ఘనంగా కొనసాగిస్తున్నారని ఆయన సోదాహరణంగా వివరించారు. కార్యకర్తగా, కార్యదక్షునిగా, కవిగా వ్యాఖ్యాతగా ఇలా బహుముఖ రంగాలలో అత్యంత ప్రతిభతో ఘనపురం దేవేందర్‌ రాణిస్తున్నారని అభినందించారు.

శిల్పము. చమత్కారం, వస్తు అన్వేషణ, సామాజిక బాధ్యత, నూతనత్వం, భాషా పటిమ, తెలంగాణ భాషపై ప్రేమ కవిత్వంలో దేవేందర్‌ను ప్రత్యేకంగా నిలబడతాయని ఆయన విశ్లేషించారు. దేవేందర్‌ కవిత్వంలో తెలంగాణ ఆత్మతో పాటు నిజామాబాద్‌ జిల్లా అస్తిత్వం ప్రధానంగా కనబడుతుందని తెలియజెప్పారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన తెలంగాణ జాగతి సాహిత్య విభాగం కన్వీనర్‌ తిరుమల శ్రీనివాస్‌ ఆర్య మాట్లాడుతూ సాహిత్యాన్ని సంఘటితంగా ముందుకు నడిపించడంలో కవిగా కార్యకర్తగా దేవేందర్‌ రాణించడం అందరికీ స్ఫూర్తి అన్నారు.

ప్రముఖకవి నరాల సుధాకర్‌ మాట్లాడుతూ కొత్త కవులకు ప్రేరణ అందించడంలో ఘనపురం దేవేందర్‌ ముందుంటారన్నారు. ముచ్చట సంపాదకుడు దశరథ్‌ కొత్మీర్‌కర్‌ మాట్లాడుతూ ముచ్చట పుస్తకాన్ని రూపొందించడంలో ఘనపురం దేవేందర్‌ కవిత్వాన్ని అందరికీ అందించడాన్ని అదష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

ముచ్చట రచయిత ఘనపురం దేవేందర్‌ మాట్లాడుతూ కవిత్వం తన బాధ్యతగా రాస్తున్నానని తెలంగాణ జాగతి ద్వారా, హరిదా, తెలంగాణ రచయితల సంఘాల ద్వారా సాహిత్య కషి చేయడం అదష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

కార్యక్రమంలో మద్దుకూరి సాయిబాబు, పంచరెడ్డి లక్ష్మణ, సిహెచ్‌ మధు, కొమిరిశెట్టి నాగరాజు, గుత్ప ప్రసాద్‌, జి.నరసింహ స్వామి, ఎండల నర్సింలు, నాగం సాయిలు, జక్కన్న గారి శ్రీనివాసరావు, ఎలగందుల లింబాద్రి, నాగనాథ్‌ థామస్కర్‌, రూపేశ్‌, మల్లవరపు విజయలక్ష్మీ, శారదా లక్ష్మణ్‌, పద్మజా రెడ్డిిి, రేణుక, మేక రామస్వామి, కేవీ రమణాచారి, దేవసాని కైలాస్‌, తంగళ్ళపల్లి నరేశ్‌, మధు రాయల, ఆశ నారాయణ, కైరంకొండ బాబు, కవులు రచయితలు తెలంగాణ జాగతి కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *