Breaking News

Daily Archives: December 2, 2019

నిందితులను ఉరితీసే చట్టం తీసుకురావాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రిమాంకరెడ్డి, మానస అత్యాచారం, హత్య సంఘటనలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 6 గంటల నుండి 7 గంటల వరకు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం నుండి నిజాంసాగర్‌ చౌరస్థ వరకు క్రొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ మహిళలపై అత్యాచార సంఘటనలు జరగటం ఘోరమని ఇలాంటి సంఘటన ...

Read More »

ఆర్మూర్‌ ఏసీపీకి రైతు పూర్వక సన్మానం

ఆర్మూర్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సంస్థ సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ఏసీపీ వేగులం రఘుని ఆర్మూర్‌లో ఆయన ఛాంబర్‌లో రైతు పూర్వక సన్మానం చేశారు. రైతు ప్రేమికుడు రఘు ఆర్మూర్‌ ఏసీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంలో సంస్థ ఫౌండర్‌ రవిందేర్‌ ర్యాడా మరియు సంస్థ సభ్యులు ఏసీపీని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. రవిందర్‌ ర్యాడా మాట్లాడుతూ రఘు లాంటి రైతు ప్రేమికుడు ఆర్మూర్‌ ప్రాంతంలో బాధ్యతలు నిర్వర్తించడం ఇక్కడి పౌరులు ...

Read More »

ప్రశంసా పూర్వక విధులకు అభినందన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎయిడ్స్‌ నియంత్రణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తన విధులను ప్రశంసా పూర్వకంగా నిర్వహించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం ఆధ్వర్యంలో సంబంధిత సిబ్బంది సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావును ఆయన ఛాంబర్‌లో కలిసి వివరాలు తెలియజేశారు. కలెక్టర్‌ వారిని అభినందిస్తూ, ముందు ముందు కూడా ఇదేవిధంగా ప్రశంసా పూర్వక, అభినందనీయ విధులు నిర్వహించాలని అన్ని విషయాల్లో జిల్లాను ...

Read More »

టీఎస్‌ ఐపాస్‌ అనుమతులకు సమయం కేటాయించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో టిఎస్‌ఐపాస్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ కొరకు వచ్చిన దరఖాస్తుల అనుమతులకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్‌ చాంబర్‌లో టీఎస్‌ ఐపాస్‌ మరియు డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి సులభంగా, త్వరగా అనుమతులు మంజూరు చేయుటకు టీఎస్‌ ఐపాస్‌ను అమల్లోకి ...

Read More »

కలెక్టర్‌ను కలిసిన ఏజీ బందం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్‌తో పాటు ఇతర కార్యాలయాలలో ఆడిట్‌ చేయడానికి అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం నుండి జిల్లాకు వచ్చిన బందం ఎస్‌.ఏ.ఓ. రాజు నాయక్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావును మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ చాంబర్‌లో కలిశారు. వారు నిర్వహించే ఆడిట్‌ విషయాలను కలెక్టర్‌కు వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కొనసాగుతున్న మొరం రోడ్డు పనులు

నందిపేట్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో గత రెండు నెలలుగా వివిధ కాలనీలలో గల అంతర్గత రోడ్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వార్డుల సంఖ్య ప్రకారం పూర్తి చేస్తూ వేరే వార్డులో పనులు చేపడుతున్నారు. సోమవారం 3 వ వార్డు బర్కత్‌పురాలో పనులు కొనసాగుతున్నాయి. వార్డు మెంబర్‌ మాన్పూర్‌ భూమేష్‌ దగ్గరుండి ప్రతి ఇంటి ముందర సరైన రోడ్డు సౌకర్యం ఉండేలా పనులు చేపడుతున్నారు. తమ కాలనీలో అద్వానంగా ఉన్న అంతర్గత రహదారులు మరమ్మతులు చేపట్టడంతో ...

Read More »

రైతు రుణాలు మాఫీ చేయండి

నందిపేట్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన హామీ మేరకు రైతు రుణాలను మాపీ చేయాలనీ కోరుతూ ఆర్మూర్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు మంద మహిపాల్‌ సోమవారం ప్రజావాణిలో తహశీల్ధార్‌ అలీవేలుకు వినతి పత్రం సమర్పించారు. వినతిపత్రంలో ఎన్నికల హామీ మేరకు రైతు రుణమాపీ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు వాగ్దానం మేరకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. ఆయతో పాటు వైయస్‌ గంగాధర్‌, జమీల్‌ యువనాయకులు ఉన్నారు.

Read More »

రానున్న తరాలకు మంచి వాతావరణం కల్పించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలుష్య నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాల్కొండ ఎంపిపి లావణ్య అన్నారు. సోమవారం నిజామాబాదు జిల్లా బాల్కొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్చంద సంస్థ జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం నిర్వహించింది. దీనికి ఎంపిపి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ నేడు కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగిపోతోందని, ప్రతి ఒక్కరు తనవంతు భాధ్యతగా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఢిల్లీ లాంటి పరిస్థితులు రాకుండా ...

Read More »

సిసి డ్రైనేజీ పనులు ప్రారంభం

నందిపేట్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం తొండాకూర్‌ గ్రామంలో సోమవారం సిసి డ్రైనేజీ పనులను ఎంపిటిసి మద్దుల రాణి మురళి ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిదుల నుండి 60 మీటర్లు, 120 మీటర్ల సిసి డ్రైనేజీ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిన్న దేవన్న, ఉపసర్పంచ్‌ రాజేందర్‌, గ్రామ కార్యదర్శి నాగేందర్‌, వార్డు సభ్యులు, విడిసి సభ్యులు, కారోబార్‌ అశోక్‌, తదితరులున్నారు.

Read More »

ఏ స్థాయి సమస్యలు ఆ స్థాయిలోనే పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామస్థాయి, మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు అక్కడే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఆయన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కారం కానందున జిల్లాకు వస్తున్నారని ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించి ప్రజల ఫిర్యాదులకు నిర్ణీత సమయంలో స్పందించి వారు పలుమార్లు కార్యాలయాలకు రాకుండా చూడాలని ఆదేశించారు. ...

Read More »