Breaking News

ఏ స్థాయి సమస్యలు ఆ స్థాయిలోనే పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామస్థాయి, మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు అక్కడే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఆయన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కారం కానందున జిల్లాకు వస్తున్నారని ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించి ప్రజల ఫిర్యాదులకు నిర్ణీత సమయంలో స్పందించి వారు పలుమార్లు కార్యాలయాలకు రాకుండా చూడాలని ఆదేశించారు.

ఈ దిశగా తమ క్రింది స్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలన్నారు. విద్యాశాఖ, సంక్షేమ శాఖల పరిధిలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇతర వివరాలను సమర్పించ వలసిందిగా అదేవిధంగా నిర్మాణాలు, వాటికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి, అభివద్ధి పనుల గురించి, ఆయా శాఖల కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను సమర్పించ వలసిందిగా కోరినప్పటికీ సరైన స్పందన లేదని, ఈనెల 5వ తేదీ కల్లా వివరాలన్నీ ఖచ్చితంగా సమర్పించాలని ఆదేశించారు.

రాష్ట్ర స్థాయి నుండి అధికారులు వివరాలు కోరుతూ పంపించే డివో లేఖలు, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, శాఖల కార్యదర్శులు, ఇతర పై స్థాయి అధికారులు పంపించే లేఖలపై వ్యక్తిగతంగా స్పందించి నివేదికలు వెంటనే సమర్పించాలని పేర్కొన్నారు. కలెక్టరేట్‌ ద్వారా అడిగిన సమాచారాన్ని నిర్ణీత నమూనాలో పంపించాలని తెలిపారు. ఆయా శాఖల ద్వారా సమర్పించే ఫైల్స్‌ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

కొన్ని శాఖలు పరిష్కరించవలసిన లేఖలు ఆయా కార్యాలయాల్లో స్వీకరించనందున కలెక్టరేట్‌లో సమర్పిస్తున్నారని ఏ కార్యాలయాలకు సంబంధించిన లేఖలు ఆ కార్యాలయంలో స్వీకరించాలని తెలిపారు. ప్రజావాణి నుండే డివిజన్‌, మండల స్థాయిలో జరుగుతున్న ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ పరిస్థితిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇతర శాఖల అధికారులు కూడా తప్పకుండా హాజరుకావాలని వారికి ఆదేశాలు జారీ చేయవలసినదిగా సూచించారు. ప్రజావాణిలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, రెవిన్యూ డివిజనల్‌ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఓ రమేష్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *