Breaking News

ఆర్మూర్‌ ఏసీపీకి రైతు పూర్వక సన్మానం

ఆర్మూర్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సంస్థ సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ఏసీపీ వేగులం రఘుని ఆర్మూర్‌లో ఆయన ఛాంబర్‌లో రైతు పూర్వక సన్మానం చేశారు. రైతు ప్రేమికుడు రఘు ఆర్మూర్‌ ఏసీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంలో సంస్థ ఫౌండర్‌ రవిందేర్‌ ర్యాడా మరియు సంస్థ సభ్యులు ఏసీపీని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు.

రవిందర్‌ ర్యాడా మాట్లాడుతూ రఘు లాంటి రైతు ప్రేమికుడు ఆర్మూర్‌ ప్రాంతంలో బాధ్యతలు నిర్వర్తించడం ఇక్కడి పౌరులు చేసుకున్న అదష్టమని తెలియజేశారు. కార్యక్రమంలో తెరాస నిజామాబాద్‌ జిల్లా యువజన విభాగం సీనియర్‌ నాయకులు మల్యాల నర్సారెడ్డి, సంస్థ సభ్యులు రాజేందర్‌ పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *