Breaking News

రానున్న తరాలకు మంచి వాతావరణం కల్పించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలుష్య నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాల్కొండ ఎంపిపి లావణ్య అన్నారు. సోమవారం నిజామాబాదు జిల్లా బాల్కొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్చంద సంస్థ జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం నిర్వహించింది. దీనికి ఎంపిపి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ నేడు కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగిపోతోందని, ప్రతి ఒక్కరు తనవంతు భాధ్యతగా నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

ఢిల్లీ లాంటి పరిస్థితులు రాకుండా ఇప్పటి నుండే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాలుష్య నివారణలో భాగంగా మొక్కల పెంపకానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున క షి చేస్తు, హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి మాట్లాడుతూ కాలుష్యం వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసి, ప్రతి ఒక్కరు కాలుష్య నివారణలో భాగస్వామ్యులై, రానున్న తరాలకు మంచి వాతావరణాన్ని కల్పించాలన్నారు.

అనంతరం విద్యార్థులు డోంట్‌ పొల్యూట్‌ ఆకారంలో కూర్చొని కాలుష్యం వద్దనే మెస్సేజ్‌ ఇచ్చారు. కార్యక్రమంలో తెరాస నాయకులు లింగాగౌడ్‌, నరహరి, సర్పంచ్‌ సునీత, మండల ప్రధాన కార్యదర్శి విద్య సాగర్‌, సంస్థ సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లు, నరహరినాయక్‌, ప్రిన్సిపాల్‌ చిన్నయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *