కొనసాగుతున్న మొరం రోడ్డు పనులు

నందిపేట్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో గత రెండు నెలలుగా వివిధ కాలనీలలో గల అంతర్గత రోడ్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వార్డుల సంఖ్య ప్రకారం పూర్తి చేస్తూ వేరే వార్డులో పనులు చేపడుతున్నారు. సోమవారం 3 వ వార్డు బర్కత్‌పురాలో పనులు కొనసాగుతున్నాయి.

వార్డు మెంబర్‌ మాన్పూర్‌ భూమేష్‌ దగ్గరుండి ప్రతి ఇంటి ముందర సరైన రోడ్డు సౌకర్యం ఉండేలా పనులు చేపడుతున్నారు. తమ కాలనీలో అద్వానంగా ఉన్న అంతర్గత రహదారులు మరమ్మతులు చేపట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మురికికూపం వలే ఉన్న మైనార్టీ కాలనీలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, మైనార్టీ వర్గానికి చెందిన సర్పంచ్‌లు రెండు సార్లు అధికారంలో ఉన్నపటికీ తమ మైనార్టీ కాలనీలకు ఎలాంటి అభివద్ధి చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటి వార్డ్‌ మెంబర్‌ భూమేష్‌, సర్పంచ్‌ ఎస్‌జి వాణిలు కలిసి కాలోని అభివద్ధికి కషి చేయడం పట్ల మైనార్టీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Check Also

గర్భిణీల‌కు పోషకాహారం పంపిణీ చేసిన ఎంపిటిసి

నందిపేట్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నందిపేట మండలం షాపురు గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *