Breaking News

నిందితులను ఉరితీసే చట్టం తీసుకురావాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రిమాంకరెడ్డి, మానస అత్యాచారం, హత్య సంఘటనలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 6 గంటల నుండి 7 గంటల వరకు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం నుండి నిజాంసాగర్‌ చౌరస్థ వరకు క్రొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ మహిళలపై అత్యాచార సంఘటనలు జరగటం ఘోరమని ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత పట్టుకున్న నిందితులను వెంటనే ఉరి తీసే విధంగా చట్టం తీసుకు రావాలని అన్నారు. వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని, హోం శాఖ మంత్రి వ్యాఖ్యలు విచారకరమన్నారు.

ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా పోలీసులు, ప్రజలు, ప్రభుత్వం అందరూ అప్రమత్తంగా ఉండి షీ టీమ్‌, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు అందరికి తెలిసే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు.

అదేవిధంగా విశ్వహిందూ పరిషత్‌ భజరంగ్‌ దళ్‌ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో మానస, ప్రియాంకలకు నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పాపిరెడ్డి, రాముజి రవి, రాజు, శ్రీనివాస్‌, రాజు, నవీన్‌, సాయి, అమర్‌నాథ్‌, నవీన్‌, బాలు, శంకర్‌, సంతోష్‌, అజిత్‌, మనోజ్‌, నవీన్‌, బజరంగ్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *