Breaking News

టీఎస్‌ ఐపాస్‌ అనుమతులకు సమయం కేటాయించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో టిఎస్‌ఐపాస్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ కొరకు వచ్చిన దరఖాస్తుల అనుమతులకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్‌ చాంబర్‌లో టీఎస్‌ ఐపాస్‌ మరియు డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి సులభంగా, త్వరగా అనుమతులు మంజూరు చేయుటకు టీఎస్‌ ఐపాస్‌ను అమల్లోకి తీసుకొచ్చిందని ఏమాత్రం ఆలస్యానికి అవకాశం లేకుండా నిర్ణీత సమయంలో దరఖాస్తుదారులకు అనుమతులు మంజూరు చేయాలని, అభ్యంతరాలు ఉన్నా కూడా వెంటనే వారికి సమాచారం అందించి తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించాలని ఆదేశించారు.

తద్వారా ఉద్యోగ అవకాశాలు లభించడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా జరుగుతాయని పరిశ్రమలు స్థాపించిన వారితోపాటు జిల్లా అభివద్ధి చెందుతుందని ఆర్థిక లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఈ సందర్భంగా 10 మంది ఎస్సీ దరఖాస్తుదారులకు, ఏడుగురు గిరిజన దరఖాస్తుదారులకు పెట్టుబడి సబ్సిడీ మంజూరు చేయటానికి టి ప్రైడ్‌ పాలసి కింద అనుమతులు మంజూరు చేశారు.

సమావేశంలో జిఎం ఇండస్ట్రీస్‌ సమ్మయ్య, ఏడి మైన్స్‌ సత్యనారాయణ, ఎల్‌డిఎం జయ సంతోషి, డి ఎస్‌సిడిఓ శశికళ, డిటిడబ్ల్యూఓ సంధ్యారాణి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, రవాణా, పొల్యూషన్‌ కంట్రోల్‌, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *