Breaking News

Daily Archives: December 3, 2019

ఛార్జీల పెంపు విరమించుకోవాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు సమ్మె పేరుతో 30 మంది ప్రాణాలు తీసిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై కిలోమీటరుకు 15 పైసల నుండి 20 పైసల వరకు ఆర్టీసీ కార్మికుల వేతనాలు సంస్థ కోసం ఉపయోగిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ జిల్లా నాయకులు రాజలింగం తెలిపారు. మంగళశారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పక్కనే ఉన్న తమిళనాడు ప్రభుత్వం 2014 లో ఉన్న డీజిల్‌ రేట్లు ఇప్పటి వరకు ...

Read More »

బిసిల అభివృద్దికి పెద్దపీట

బాన్సువాడ, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ వెనుకబడిన తరగతుల (బిసి) సంక్షేమ కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్‌లో జరిగింది. కమిటీ చైర్మన్‌ వై. అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. పేదల కష్టాలు తెలిసిన సభ్యులతో కూడిన కమిటీ ఇది అని, గతంలో ప్రజాప్రతినిధులు అంటే కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే అగుపడపతారు అనే నానుడి ఉండేదని, కాని నేడు ప్రజల మద్య గ్రామాలలో తిరుగుతూ ప్రజా సమస్యలను ...

Read More »

బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూడాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నెలవారి సమీక్షా సమావేశంలో 23 పోలీస్‌ స్టేషన్ల యొక్క ఎస్సైలు వారి పై అధికారులు సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌లు, డీఎస్పీ అధికారులు పాల్గొన్నారు. కేసుల యొక్క పురోగతిని అదేవిధంగా కేసుల పరిశోధనలో ఇన్వెస్టిగేషన్‌ అధికారులు ఏ విధంగా కేసు యొక్క వివరాలు సేకరిస్తున్నారు. నిందితుల యొక్క నేర నిరూపణ జరిగే విధంగా అభియోగ పత్రాలు తయారు చేస్తున్నారా లేదా అనే దానిపై పూర్తిస్థాయిలో జిల్లా పోలీసు ఉన్నతాధికారి, ...

Read More »

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి. ఆదిరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జనహితలో సివిల్‌ సప్లై అధికారులు, సహకార కొనుగోలు కేంద్రాల సిఓలు, ఐకేపీ ఇన్‌చార్జిలు, ట్రాన్స్‌ పోర్టు కాంట్రాక్టర్లు, రైస్‌ మిల్లర్లతో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 38 వేల మంది రైతుల నుండి 380 కోట్ల రూపాయల విలువ గల ...

Read More »

మొరం గుంతలను పరిశీలించిన మైనింగ్‌ ఆర్‌ఐ

రెంజల్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో అక్రమంగా మొరం తవ్వకాలు చేపట్టిన సాటాపూర్‌, రెంజల్‌ శివారులో గల మొరం గుంతలను మైనింగ్‌ ఆర్‌ఐ ఆంజనేయులు మంగళవారం పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ పనులు చేపడితే సంబంధిత అధికారుల అనుమతి పొందాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ కిషోర్‌, బీజేపీ నాయకుడు మేక సంతోష్‌ ఉన్నారు.

Read More »

అక్రమ లేఅవుట్ల తొలగింపు

రెంజల్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బొర్గం, నీలా, సాటాపూర్‌ గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్లు నిర్మిస్తున్న ప్రాంతంలో సరిహద్దులను ఏర్పాటు చేసిన రాళ్లను మంగళవారం మండల పరిషత్‌ అభివద్ధి అధికారి గోపాలకష్ణ సిబ్బందితో తొలగించారు. పంచాయతీ అనుమతి లేకుండా లేఅవుట్లు నిర్మాణ పనులు చేపట్టరాదని తప్పనిసరిగా పంచాయతీ అనుమతులు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపిఓ గౌస్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శులు అమ్రిన్‌, రాణి తదితరులు ఉన్నారు.

Read More »

దివ్యాంగులపై వివక్ష వీడాలి

రెంజల్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో దివ్యాంగులపై చూపించాల్సింది సానుభూతి కాదని వారికి కావాల్సింది ప్రోత్సాహమని ఎంపీపీ లోలపు రజినీ అన్నారు. మండలంలోని సాటాపూర్‌ భవిత కేంద్రంలో మంగళవారం దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రజినీ మాట్లాడుతూ సమాజంలో అన్ని సవ్యంగా ఉన్న వారి కంటే శారీరక మానసిక లోపం ఉన్నవారు ఎందరో ఎన్నో రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. లోపం శరీరానికే తప్ప తెలివి తేటలకు కాదని నిరూపించారన్నారు. వారికి జాలి దయ ...

Read More »

కళాశాలలో పాముల బెడద

నందిపేట్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలకేంద్రంలోని మాడల్‌ కళాశాలలో విషసర్పాలు సంచరిసున్నాయి. మంగళవారం కూడా తరగతి గదిలో పెద్ద పాము కనబడటంతో భయబ్రాంతులకు గురైన విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులకు చెప్పడంతో స్థానికంగా సరదా కొరకు పాములను పట్టే సర్వర్‌ను పిలిచి సర్పాన్ని పట్టించారు. కానీ పిల్లలు మాత్రం భయబ్రాంతులకు గురవుతున్నారు. సకాలంలో పిల్లలు సర్పాన్ని పసిగట్టి ఉండకపోతే జరగరాని అనర్థం జరిగేది. ఇప్పటికైన ఉపాధ్యాయులు, అధికారులు స్పందించి పాములు లోనికి ప్రవేశించకుండా తగుచర్యలు ...

Read More »

82 మంది విద్యార్థులకు అస్వస్థత

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్స్టిట్యూషన్‌ సొసైటీ బాలికల వసతి గృహంలో దోమకొండలో 82 మంది బాలికలకు క్రిమి కరవడం, శరీరంపై పాకడం వలన దురద, చర్మంపై దద్దుర్లు రావడంతో ఇబ్బంది పడుతున్నారు. బాలికలను గమనించిన ప్రిన్సిపాల్‌ తులసీదాస్‌, స్టాఫ్‌ నర్స్‌ దైవ కప ఈ విషయమై అప్రమత్తమై బీబీపేట పి.హెచ్‌.సి మెడికల్‌ ఆఫీసర్‌ శివకు సమాచారం అందించారు. మెడికల్‌ ఆఫీసర్‌ తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని విద్యార్థులందరిని పరిశీలించగా అది ...

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌కు చెందిన ఎమ్‌.ప్రదీప్‌కు 16 వేల 500 రూపాయలు, అంకపూర్‌కీ చెందిన ఎస్‌.భారత్‌కు 30 వేల 500 రూపాయలు, కోమనపల్లికి చెందిన బి. గంగారాజ్యంకు 32 వేల రూపాయలు, మిర్ధపల్లికీ చెందిన పి.శ్యాం సుందర్‌కు 56 వేల రూపాయలు, సూబ్రియల్‌కి చెందిన ఎస్‌. ఆశాకు 18 వేల రూపాయలు, అంకపూర్‌కీ చెందిన పి.పెద్ద ముత్తెన్నకు 14 వేల రూపాయలు, గోవింద్‌ పెట్‌కీ చెందిన సి.జ్యోతికి 9 వేల రూపాయల ...

Read More »

సబ్‌ రిజిస్టార్‌గా పాఠశాల ఉపాధ్యాయుడు అశోక్‌

బీర్కూర్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపియుపిఎస్‌ తిమ్మాపూర్‌ పాఠశాల ఉపాధ్యాయుడు అశోక్‌ సబ్‌ రిజిస్టార్‌గా నియమితులైన సందర్భంగా పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీర్కూర్‌ మండల ఎంపిపి రఘు, మండల విద్యాధికారి నాగేశ్వర రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి, బీర్కూర్‌ మండల పిఆర్‌టియు యూనియన్‌ ప్రతినిదులు రవీంద్ర జెట్టి, నర్సింలు, గ్రామ పెద్దలు అప్పారావు, మురళి, సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఎస్‌ఎంసి చైర్మన్‌ రవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

నందిపేట్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిర్పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో మల్లారెడ్డి, రాజేశ్వర్‌, మహేష్‌, దిలీప్‌, నాగన్న, పాల్గొన్నారు.

Read More »

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ

బీర్కూర్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని జ్యోతి రావు బాపూలే పాఠశాలలో రిలైన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎలాంటి మందులు లేకుండా ఎరువులపై పండించే కురాగాయల కొరకు మార్కింగ్‌ చేసి విత్తనాలు అందించారు. అలాగే రిలైన్స్‌ ఫౌండేషన్‌ సిఆర్‌పి సజన మాట్లాడుతూ కూరగాయలు కాపాడటానికి చుట్టూ కంచే రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వసంత్‌ రెడ్డి, పిఇటి దేవిదాస్‌, పాఠశాల సిబ్బంది పవన్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Read More »

దివ్యాంగులకు ఆటల పోటీలు

నందిపేట్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నందిపేట్‌ భవిత కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ వివిధ ఆటల పోటీలు నిర్వహించి, అందరికి బహుమతులు ప్రదానం చేశారు. పిల్లలు, వారి తల్లిదండ్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షులు వాకిటి సంతోష్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు దేవేందర్‌, తహసీల్దార్‌ అలివేలు, మండల అభివద్ధి అధికారి ...

Read More »

ఇతరులకంటే దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు ఇతరులకంటే ఏ రంగంలోనూ తీసిపోరని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సంబంధిత శాఖలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో వేడుకలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, స్థానిక శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తాతో కలిసి ఆయన జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు వారికి గల వైకల్యం ...

Read More »

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని దక్షిణ ప్రాంగణంలో గత తొమ్మిది రోజుల నుండి విధులు బహిష్కరించి పొరుగు సేవల సిబ్బంది చేస్తున్న సమ్మెను ఉద్దేశించి మంగళవారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి ఐరన్‌ సందీప్‌లు మాట్లాడారు. సుప్రీంకోర్టు గతంలో చాలాసార్లు ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని తెలియజేసినప్పటికి తెలంగాణ యూనివర్సిటీలోని పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది యొక్క వేతనాలు చాలా తక్కువగా ...

Read More »

చీపుర్లు పట్టారు.. శుభ్రం చేశారు…

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం స్వచ్ఛ గన్‌పూర్‌లో భాగంగా గ్రామంలో ఉన్న హై స్కూల్‌ నుండి తహసీల్‌ కార్యాలయం వరకు తారు రోడ్డు మీద ఉన్న దుమ్ము ధూళిని చీపుర్లతో తొలగించారు. తార్‌ రోడ్డుపైన దుమ్ము ఉండడం వల్ల భారీ వాహనాలు వచ్చినప్పుడు లేచి అందరి కళ్ళల్లో పడుతుంది, అలాగే ద్విచక్ర వాహనదారులు కూడా మట్టి ఉండడంతో అనేక సార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇది గమనించిన గ్రామస్తులు, యువకులు స్తానిక పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్చభారత్‌ ...

Read More »

శ్రీకాంతాచారి త్యాగం వృధా కాదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి విద్యార్థి విభాగం (టిజెఎస్‌ఎఫ్‌) నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం కన్వీనర్‌ అవుసుల రామ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ తొలి అమరవీరుడు శ్రీకాంతచారి 10వ వర్ధంతిని మంగళవారం ధర్పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. తన దేహం మంటల్లో కాలి బూడిదవుతున్న చివరి వరకు తెలంగాణ నినాదం వీడని గొప్ప త్యాగశీలి శ్రీకాంతాచారి అని కొనియాడారు. శ్రీకాంతాచారి త్యాగం వధా కాలేదని, అయన కలలు కన్న బంగారు తెలంగాణ రూపు దిద్దుకుంటుందని అన్నారు. ...

Read More »

గ్రామాభివృద్ధికి ఆర్థిక సాయం

నందిపేట్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండాకూర్‌ గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి విడిసి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు గ్రామా అభివద్ధికి గాను తన వంతు సాయంగా చెక్కు అందజేశారు. 6 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కుర్మే చిన్న దేవన్న విడిసి సభ్యులు గంగాధర్‌, తెరాస పార్టీ అధ్యక్షులు అల్లరి నవీన్‌ తదితరులున్నారు.

Read More »