Breaking News

82 మంది విద్యార్థులకు అస్వస్థత

కామారెడ్డి, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్స్టిట్యూషన్‌ సొసైటీ బాలికల వసతి గృహంలో దోమకొండలో 82 మంది బాలికలకు క్రిమి కరవడం, శరీరంపై పాకడం వలన దురద, చర్మంపై దద్దుర్లు రావడంతో ఇబ్బంది పడుతున్నారు. బాలికలను గమనించిన ప్రిన్సిపాల్‌ తులసీదాస్‌, స్టాఫ్‌ నర్స్‌ దైవ కప ఈ విషయమై అప్రమత్తమై బీబీపేట పి.హెచ్‌.సి మెడికల్‌ ఆఫీసర్‌ శివకు సమాచారం అందించారు.

మెడికల్‌ ఆఫీసర్‌ తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని విద్యార్థులందరిని పరిశీలించగా అది ఒక క్రిమి శరీరంపై పాకడం వలన, లేదా కరిచిన దాని ద్వారా దురదలు, దద్దుర్లు వస్తాయని తెలిపారు. వారందరికీ ప్రథమ చికిత్స చేసి మందులు అందజేశారు. అందులో ఆరుగురు విద్యార్థులను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పురుగు కరవడం గాని శరీరంపై పాకడం వల్ల కానీ ఇలాంటి దురదలు వస్తాయని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో దోమకొండ ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది యాదమ్మ, సునీత, సూపర్‌వైజర్‌ మనిమాల, బిబిపెట్‌ ఆరోగ్య కార్యకర్త హరి ప్రసాద్‌లు పాల్గొని వారికి చికిత్స చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన కు గురి కావద్దని, మా స్వంత పిల్లవలేనే చూస్తున్నామని, మెడికల్‌, రెసిడెన్సియల్‌ సిబ్బంది అందరం అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరీక్షించి చూస్తున్నామని తెలిపారు.

Check Also

ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ ఆఫీస్‌ సమీపంలో తెలంగాణ ...

Comment on the article