Breaking News

బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూడాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నెలవారి సమీక్షా సమావేశంలో 23 పోలీస్‌ స్టేషన్ల యొక్క ఎస్సైలు వారి పై అధికారులు సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌లు, డీఎస్పీ అధికారులు పాల్గొన్నారు. కేసుల యొక్క పురోగతిని అదేవిధంగా కేసుల పరిశోధనలో ఇన్వెస్టిగేషన్‌ అధికారులు ఏ విధంగా కేసు యొక్క వివరాలు సేకరిస్తున్నారు.

నిందితుల యొక్క నేర నిరూపణ జరిగే విధంగా అభియోగ పత్రాలు తయారు చేస్తున్నారా లేదా అనే దానిపై పూర్తిస్థాయిలో జిల్లా పోలీసు ఉన్నతాధికారి, అడిషనల్‌ ఎస్పీ తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగినటువంటి సంఘటన గురించి చర్చించి ప్రజల రక్షణ కొరకు అనుక్షణం పాటుపడుతున్న తెలంగాణ పోలీస్‌ శాఖలో కొందరు చేసిన చిన్న చిన్న తప్పిదాల వలన ప్రజల రక్షణ కొరకు పాటుపడే విధి నిర్వహణలు అన్ని కూడా బూడిదలో పోసిన పన్నీరు లాగా మార్చేస్తున్నారన్నారు.

కావున ప్రతి ఒక్కరు కూడా తమరి పరిధిలో ఉన్నటువంటి విషయాలను / ఫిర్యాదులను సత్వరమే ఒక బాధ్యతాయుతంగా తీసుకొని బాధితులకు తగిన న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. ఇకపై ఏ ఒక్కరు కూడా ఇది తమ పరిధిలోకి రాదని చెప్పవద్దని తమ దష్టికి వచ్చిన వెంటనే స్పందించాలని తెలిపారు.

Check Also

ఉచిత చదువును అందించిన గొప్పవ్యక్తి

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు జన్మదినాన్ని ...

Comment on the article