Breaking News

దివ్యాంగులపై వివక్ష వీడాలి

రెంజల్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో దివ్యాంగులపై చూపించాల్సింది సానుభూతి కాదని వారికి కావాల్సింది ప్రోత్సాహమని ఎంపీపీ లోలపు రజినీ అన్నారు. మండలంలోని సాటాపూర్‌ భవిత కేంద్రంలో మంగళవారం దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ రజినీ మాట్లాడుతూ సమాజంలో అన్ని సవ్యంగా ఉన్న వారి కంటే శారీరక మానసిక లోపం ఉన్నవారు ఎందరో ఎన్నో రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. లోపం శరీరానికే తప్ప తెలివి తేటలకు కాదని నిరూపించారన్నారు.

వారికి జాలి దయ కరుణ కంటే ప్రోత్సాహం ముఖ్యమని ఆమె అన్నారు. అనంతరం దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ, ఎంఈవో గణేష్‌ రావ్‌, సర్పంచ్‌ వికార్‌ పాషా, ఎంపీటీసీ హైమద్‌, ఉపాధ్యాయులు విశ్వనాథన్‌, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *