Breaking News

ఇతరులకంటే దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు ఇతరులకంటే ఏ రంగంలోనూ తీసిపోరని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సంబంధిత శాఖలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో వేడుకలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, స్థానిక శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తాతో కలిసి ఆయన జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు వారికి గల వైకల్యం గురించి బాధ పడాల్సిన అవసరం లేదని మానసికంగా వారెంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. ఇతరులకు దీటుగా అన్ని రంగాల్లో వారు రాణిస్తూ అనుకున్న స్థాయికి ఏకాగ్రతతో, పట్టుదలతో చేరుకున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వం వీరికి ఎల్లవేళల అండదండగా ఉంటుందని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం తరఫున వీరికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు సదుపాయాలు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.

ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు రూ.3016 ఆసరా పెన్షన్‌ అందిస్తుందని పేర్కొన్నారు. భావిభారత పౌరులుగా ఎదగడానికి వీరు వారి వంతుగా అన్ని రకాలుగా కషి చేస్తున్నారని తెలిపారు. మరో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ దివ్యాంగులపై చూపే దయకు బదులుగా సహాయ సహకారాలు అందించడానికి ఈరోజు అంకితం కావాల్సిన అవసరముందన్నారు.

ప్రత్యేక దినోత్సవం జరుపుకోవడం అంటే సంవత్సరమంతా కార్యక్రమాలు నిర్వహించడమని అర్థం చేసుకోవాలన్నారు. దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేసుకున్న రక్షణ చట్టాలు సదుపాయాలపై కల్పించవలసిన ప్రభుత్వంతో పాటు వీరి కొరకు స్వచ్ఛంద సేవా సంస్థలు నిస్వార్థంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిని అక్కున చేర్చుకుంటున్నారని, ఈ విషయంలో వారిని అభినందించాల్సిన అవసరముందన్నారు.

జిల్లాలో 19600 మంది దివ్యాంగులకు 6 కోట్ల రూపాయలు పెన్షన్‌ చెల్లిస్తామని తెలిపారు. వీరు సౌకర్యార్థం మూడు చక్రాల సైకిల్‌ వాహనాలను అందించామని మరింత ఇబ్బంది కలగకుండా ఈ మధ్యనే 373 మందికి బ్యాటరీతో నడిచే వాహనాలను అందజేయడం జరిగిందన్నారు. ఇంకా మిగిలిన వారికి కూడా నిధులు వచ్చిన తర్వాత సీనియార్‌టీ ప్రకారం వాహనాలు అందిస్తామన్నారు.

వీరికి ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 5000 జాబ్‌ కార్డులు ఉన్నాయని వారికి 1.70 లక్షల పని దినాలతో ఐదు కోట్ల రూపాయలు కూలీ డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. తద్వారా ఇతరులకంటే పనుల్లో వీరు ఏమాత్రం వెనుకబడి లేరని నిరూపించారు అన్నారు. సమాజాభివద్ధిలో వారి వంతుగా భాగస్వాములు అవుతున్నారని ప్రశంసించారు.

ఇంతకు ముందు జరిగిన శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో వారికి సదుపాయాలు ఏర్పాటు చేయడంతో ఇతర ఓటర్ల కంటే ఎక్కువశాతం ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియలో మేము ముందుంటామని నిరూపించారన్నారు. ఇందుకుగాను వారిని చేయించిన కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరముందన్నారు. సదుపాయాలు కల్పిస్తే వారు ఏ స్థాయిలో అభివద్ధి చెందుతారో తెలియజేశారు.

మిగతా పిల్లల కంటే వీరు కొన్ని రంగాలలో ఎంతో పరిణతి కనబరుస్తున్నారని వీరిలోని సజనాత్మకతను గుర్తించి వెలికి తీయడం ద్వారా ఎందరో ఆణిముత్యాలు వారి ప్రతిభను ప్రదర్శించగలుగుతారని తెలిపారు. వారిపై చూపించాల్సింది జాలి కాదని కేవలం సదుపాయాలు కల్పించి సహాయ సహకారాలు అందించి ప్రోత్సహిస్తే వారేమిటో నిరూపిస్తారన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు గణేష్‌ గుప్తా మాట్లాడుతూ వీరిపై గౌరవం, ప్రేమ చూపిస్తే సరిపోతుందని తన పిల్లల పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమం, మానసిక వికలాంగుల ఆశ్రమాల్లో జరుపుకుంటామని, వారితో విందు భోజనం చేయడం తగ్గుతుందని తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థలు వీరి కోసం నిర్వహిస్తున్న సేవను అభినందించడం తోపాటు సమాజం కూడా స్పందించవలసి ఉందన్నారు.

అనంతరం స్నేహ సొసైటీ, జేసీ సంస్థ తదితర ఎన్జీవోస్‌ సంస్థల విద్యార్థులు సాంస్కతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. వీరికి నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమాల్లో అడిషనల్‌ సిపి ఉష విశ్వనాథ్‌, డిఆర్‌డిఓ రమేష్‌, మెప్మా పిడి రాములు, ఐసిడిఎస్‌ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దివ్యాంగులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పనుల‌ పురోగతి బాగుంది

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందల్వాయి, గన్నారంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ...

Comment on the article