Breaking News

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని దక్షిణ ప్రాంగణంలో గత తొమ్మిది రోజుల నుండి విధులు బహిష్కరించి పొరుగు సేవల సిబ్బంది చేస్తున్న సమ్మెను ఉద్దేశించి మంగళవారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి ఐరన్‌ సందీప్‌లు మాట్లాడారు.

సుప్రీంకోర్టు గతంలో చాలాసార్లు ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని తెలియజేసినప్పటికి తెలంగాణ యూనివర్సిటీలోని పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది యొక్క వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, వేతనాలను పెంచవలసిందిగా గతంలో ఎన్నోసార్లు యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్‌లను ను కలిసినప్పటికీ వేతనాలు పెంచకపోవడం బాధాకరమన్నారు. దీంతో గత తొమ్మిది రోజుల నుండి నిరసన దీక్ష చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

వెంటనే తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్‌, ఉన్నత విద్యాశాఖ సెక్రటరీలు స్పందించి వీరి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. వీరు చేస్తున్న సమ్మెకు కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘాలు పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసి రాష్ట్ర నాయకుడు సంతోష్‌ గౌడ్‌, స్కాలర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి భరత్‌, పొరుగు సేవల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ ఆఫీస్‌ సమీపంలో తెలంగాణ ...

Comment on the article